బంగారం .. భారతీయుల బావోద్వేగం. ఇంట ఏ శుభకార్యం జరిగినా పసిడి పంట పండాలి. తరాల నుంచి పెనవేసుకున్న బంధాన్ని ఇప్పటికీ కొనసాగించటమే భారతీయుల ప్రత్యేకత. శుభకార్యాల్లో సామాజిక హోదాకు గుర్తుగా.. ఆపద సమయంలో కొండంత అండగా బంగారానికి విలువ ఎప్పటికీ ఉంటుంది. అటువంటి పసిడి ధరలు ఊహించని విధంగా పెరిగిపోతున్నాయి. ఊహకందని రీతిలో చుక్కలు చేరుతోంది. ఈ రోజు అక్టోబరు ఫ్యూచర్ మార్కెట్‌లో 10 గ్రాముల ధర రూ.55,300. వెండి ఏకంగా కిలో ధర రూ.70వేలకు పైగా చేరింది. బుధవారం ఒక్కరోజు కేజీ బంగారం ధర ఆరువేల చిల్లర పెరిగింది. ఇంకా పెరుగుతాయా? అంటే అవును అంటున్నారు నిపుణులు..ఆగస్టు నెలాఖరుకు 60 వేల రూపాయలు దాకా చేరొచ్చని ఒక అంచనా..
ఎందుకింతగా బంగారం ధర పెరుగుతుందంటే!
భారతీయ సంస్కృతిలో మార్చి నెల నుండి అన్నీ శుభకార్యక్రమాలు జరుగుతాయి..కానీ లాక్ డౌన్ వల్ల అవన్నీ ఇప్పటి వరకు వాయిదా పడుతూ రావడం, అన్నీ ఒకేసారి మొదలవడం డిమాండ్ కి తగ్గట్టు బంగారం సప్లై ఎప్పుడు పెరగదు. ధర పెరుగుతుంది. ఎందుకంటే డిమాండ్ ఉంది కదాని బంగారు గనుల్లో తవ్వకం ఎక్కువ జరిపి సప్లై పెంచరు.
అమెరికా మరియు చైనా ల మధ్య వ్యాపార సంబంధాలు బెడిసికొట్టడం అమెరికా డాలర్ విలువ పెరిగింది. అంతర్జాతీయంగా బంగారం ధర అమెరికా డాలర్ తో వినిమయ విలువ(ఎక్స్చేంజి వాల్యూ ) నిర్ణయమవుతుంది. ప్రస్తుతం డాలర్ విలువ 76 రూ.( క్రాస్ రేట్) పై చిలుకు పెరగడంతో రూపాయి విలువ తగ్గడం వలన బంగారం ధర పెరగక తప్పదు..
కోవిడ్ వల్ల వడ్డీ రేట్లు తగ్గడం వలన ఒక్క బంగారంలో మినహా , ఇతర రూపాల్లో పెట్టుబడి పెట్టడం హై రిస్క్ అందుచేత బంగారం లో పెట్టుబడికి, పెట్టుబడి దారులు సుముఖత చూపటం…మరొకటి బంగారానికి హై లిక్విడిటీ (నగదులోనికి వెంటనే మార్చుకొనే సౌకర్యం) కూడా ఒక కారణం.
రిజర్వ్ బాంక్ లేదా కేంద్ర ఆర్థిక శాఖ వారు విత్తపరిపాలన, మరియు విదేశీ నిల్వల నిర్వహణ లో భాగంగా బంగారాన్ని కొనడం లేదా అమ్మడం వంటి చర్యల వల్ల ధర పెరగొచ్చు/తగ్గొచ్చు
దిగుమతి సుంకాలు పెంచడం వలన కూడా బంగారం ధర పెరిగే అవకాశం లేకపోలేదు. దేశీయంగా ఉత్పత్తి అయ్యే బంగారం ప్రపంచ వ్యాప్త ఉత్పత్తి లో ఒక శాతం లోపే, కానీ బంగారం మన దేశీయ వాడకం మాత్రం ప్రపంచంలో భారత్ ద్వితీయ స్థానం లో ఉంది.
ద్రవ్యోల్బణం వలన ద్రవ్యం( కరెన్సీ) విలువ తగ్గుతుంది. దరిమిలా బంగారం ధర పెరుగుతుంది.
కోవిడ్ దృష్ట్యా మార్కెట్ లో రుణ పరపతి తగ్గిపోయింది. ఉద్యోగులకు జీతాలు లేవు, పనులు చేసుకొనే వారికి పనులు లేవు, వ్యాపారాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.అందుచేత అప్పు ఇస్తే తిరిగి వస్తదో రాదోనని, అప్పు ఇవ్వని పరిస్థితి, దీనికి ప్రత్యామ్నాయం బాంక్ డెపాసిట్లు, మూటవల్ ఫండ్స్ ఇవన్నీ వడ్డీ రేటు తక్కువ..వీటన్నిటితో పోల్చుకొంటే బంగారం కొని పెట్టుకొంటే మంచిది కదాని ఒక ఆలోచన…
బంగారాన్ని అవసరం కోసం కొనాలి గాని పెరుగుతుందని కొనకూడదు..ఎందుకంటే సప్లై ఎక్కువయినపుడు రేటు పడిపోతుంది…సప్లై అంటే ఉత్పత్తి కాదు…ఉదాహరణకు ఒక దేశం అవసరాల నిమిత్తం కొన్ని వందల టన్నుల బంగారాన్ని అమ్మకానికి పెట్టినప్పుడు , సప్లై పెరిగి ధర తగ్గుతుంది(1990 ప్రాంతంలో అప్పటి ప్రధానమంత్రి చంద్రశేఖర్ దేశ అవసరాల నిమిత్తం బంగారం అమ్మిన సంగతి విదితమే)
పెట్టుబడి పెట్టేవారు బంగారం తో పాటు కొంత భాగం మిగతా వాటిల్లో పెట్టుబడి పెడితే లాభం..
ఉదాహరణకు
Sovereign Gold Bonds
Exchange TradedFunds
FoFs (Gold Fund of Funds)
Gold Savings Schemes
అయితే వీటిల్లో పెట్టుబడి పెట్టేటప్పుడు మార్కెట్ మీద కొంత అగాహన ఉండి మార్కెట్ ని అధ్యయనం చేసి పెట్టుబడి పెడితే ఉపయోగం
-పెర్నా విశ్వేశ్వరరావు, విశ్లేషకులు
Nice explanation sir
👌👌 , very good
Good analysis
Very nice, Bangaram gurinchi Bangaram lanti salaha echaru.
Excellent Analysis బావా!
Nice explanation sir.
Good analysis
మంచి విశ్లేషణ ద్వారా ధర పెంపు కు గల కారణాలు తెలియజేస్తూ వచ్చినందుకు చాలా సంతోషం.
Excellent analysis
Nice Bro
Nice Bro 👌👌
Super sir,👌👌👌👌
Good analysis
Good analysis anna.
Good analysis and congratulations.l newly found an economist in our VisweswaraRaoGARU.THANK YOU….
Perfect analysis like Economist
I think you have trading experience also superb
Good analysis and congratulations
బంగారం గురించి వివరంగా విశదీకించారు. ధన్యవాదాలు
అన్నా… మంచి విశ్లేషణ.. ముందు ముందు ఇటువంటి ఆర్టికల్స్ మరిన్ని రాయాలని ఆశిస్తున్నా.. శుభాకాంక్షలు
Excellent and erudite analysis. Clearly explained the reasons for the burgeoning demand for investment in gold and suggested the necessary care to be taken while investing in gold. It is also gently touched by you the general rule i.e, ‘Do not put all your eggs in a basket’. Congratulations for providing good awareness which may act as a projection for the people those who are interested to invest.
Good
Good analysis sir
Thank you one and all for your valuable comments and compliments
Super analysis uncle. Thats a splensing information at a glance.
*splendid