మెగా ఇంట ఏ సందడి జరిగినా అభిమానులకు పండుగ లాంటిదే. చిరంజీవితో అంతగా పెనవేసుకున్న అనుబంధం . అందుకే.. మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక నిశ్చితార్దం నుంచి ఉదయ్‌పూర్‌లో జరిగే పెళ్లి వరకూ అన్నీ ఆసక్తిగా గమనిస్తున్నారు. మెగా కుటుంబానికి తగినట్టుగా అద్భుతమైన ఏర్పాట్లతో అట్టహాసంగా పెళ్లి చేయబోతున్నారు. ఈ సమయంలో నాగబాబు ఇంట జరిగే ప్రతి వేడుకను అభిమానులు కూడా ఆస్వాదిస్తున్నారు. తన తల్లి నిశ్చితార్ధం చీరతో అంటే.. 32 ఏళ్ల క్రితం పద్మజ దరించిన చీరతో నిహారిక అందంగా కనిపించటమే కాదు.. అమ్మ నడచిన బాటలోనే తాను కూడా కుటుంబానికి అండగా ఉంటానంటూ చెప్పకనే చెప్పారు. ప్రత్యేక విమానంలో నిహారిక జంట, నాగబాబు జంట ప్రయాణిస్తున్న ఫొటో కూడా నిహారిక పోస్టు చేశారు. డాడీ అని పిలిచే చిరంజీవి కూడా నిహారిక పెళ్లిలో ఎంత ఆనందంగా ఉన్నారనేది కనిపిస్తూనే ఉంది. ఏమైనా.. పెద్దలు కుదిర్చిన వివాహం.. ఎంత అందంగా.. మరెంత మధురజ్ఞాపకంగా ఉంటుందనేందుకు మెగా ఇంట పెళ్లి నిదర్శనం. ఫ్యాన్స్‌కూడా గతానికి భిన్నంగా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు.