చిన్నపుడు.. దగ్గు వస్తే.. నానమ్మ కరక్కాయ ముక్క చేతికి ఇచ్చి కాసేపు నోట్లో పెట్టుకుని నములుతూ ఉండమనేది. తలనొప్పిగా ఉందనగానే.. ఇంతేసి శొంఠి అరగదీసి తలకు రాసేవారు. జ్వరం వస్తే.. లంకణం పరమౌషధం అనేవారు. ఇంట్లో పోపుల పెట్టెతోనే తాత, బామ్మలు రోగాలను ఎదిరించారు. అటువంటిది ప్రకృతి పంచిన ఆయుర్వేదంలో ఇంకెంతటి ఆరోగ్య సంపద దాగుంటుంది. చైనాలోని వూహాన్‌లో పుట్టిన కరోనాకు గబ్బిలం నుంచి కుక్కల వరకూ ప్రతి మాంసాన్ని ఆరగించటమే కారణమంటూ ఏ నాడో శాస్త్రవేత్తలు చెప్పారు. ప్రకృతి నుంచి వచ్చిన మనిషి.. ప్రకృతిధర్మానికి కట్టుబడే మనుగడ సాగించాలి. కాదని ఎదురుతిరిగితే.. ఇటువంటి విపరీతాలే పుట్టుకొస్తాయంటున్నారు ఆయుర్వేద నిపుణులు. అందుకే.. కరోనా రక్కసి భయపెడుతున్న వేళ ఆయుర్వేదంలోని వివిధ మందులతోపాటు. చ్యవనప్రాశ కూడా తీసుకోవాలని.. హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ సునీతాజోషి సూచిస్తున్నారు. వైరస్ రాకుండా అడ్డుకునేందుకు అవసరమైన రోగనిరోధకశక్తి.. వైరస్ భారినపడితే కాపాడగల అస్త్రం ఆయుర్వేదమంటున్నారు.
కొన్ని శతాబ్దాలుగా ఆరోగ్యాన్ని కాపాడుకోవటం మరచిపోయాం.. కొనుక్కోవటానికి అలవాటుపడ్డాం. ఫలితంగానే ప్రకృతి వైపరీత్యాలు, వింత వ్యాధులు వ్యాపిస్తున్నాయి. అంతమాత్రాన గతంలో రాలేదా అంటే చాలా అంటువ్యాధులు వచ్చాయి. తగ్గాయి. కానీ ఇంతగా భయపెట్టిన సందర్భాల్లేవు. ఆయుర్వేదంలో దీన్నే జనపదోధ్వంసాలు అంటారు. గాలి, నీరు, అన్నీ కలుషితం అవుతున్నాయి. . దీంతో ఎక్కువగా జనం రోగాల భారినపడటం, మరణించటం జరుగుతుంది. ప్రాణం ఎక్కడ ఉందంటే ఛాతీను చూపుతాం. ప్రాణం నిలిచేందుకు గుండె, ఊపిరితిత్తులు చాలా చక్కగా.. ఆరోగ్యంగా పనిచేయాలి. ఇప్పుడీ కరోనా వైరస్ మన ముక్కు, గొంతు, చెవుల ద్వారా కూడా వెళ్లే అవకాశం ఉంది. మొదట ఊపిరితిత్తులకు సోకుతుంది. దీనికిబలం చేకూర్చాలి. . ఇంతకముందు కూడా ఇలాంటి జబ్బులు వచ్చాయి. ప్రాణాన్ని నిలుపుకోవాలి. రోగనిరోధకశక్తి పెంచుకోవాలి. షడ్రుచులుంటారు. వీటిలో ఒక లవణ రసం తప్ప.. ఆహారంలోనూ షడ్రుచులు ఉండాలి. ఇమ్యూనిటీను పెంచటం ముఖ్యం. ఇవన్నీ ఉంచినవే చ్యవనప్రాశలో లభిస్తాయి. చవనుడు అనే మహర్షి చెప్పిన మాట ఇది. ఇది ఎప్పుడూ చిన్నపిల్లల నుంచి ముసలివాళ్ల వరకూ ఎవరైనా తీసుకోవచ్చు. ఉదయాన్నే పరగడుపున పెద్దవాళ్లు ఒక చెంచా, పిల్లలు సగం చెంచా, పాలతో కలిపి తీసుకోవాలి. పాలను బతికి ఉండటానికి ముఖ్యమంటారు. పాలలో ప్రొటీన్, కాల్షియం, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే.. ఏదైనా కూడా ముందు ఇవి అనుపానమని చెబుతారు. మందు ఒక్క శక్తిని పెంచుతుంటాయి. ఈ రెండింటి వల్ల ఆరోగ్యాన్ని మెరుగు పరచుకోవచ్చు. మధుమేహం(షుగరు), జీర్ణకోశ సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా తీసుకుని వాడాలి.
రక్షాకిట్
తెలంగాణ వైద్య ఆరోగ్య మంత్రత్వ శాఖ-ఆయుష్ కూడా ఆయుర్వేదంలో కొవిడ్19 రక్షణకు రక్షాకిట్ పేరిట ఆయుర్వదే మందులు అందిస్తున్నాయి. ఉష్ణోద్రకం, (వేడినీళ్లు), జీవనధార, జంతూఘ్న దూప చూర్ణం, హరితకీ టాబ్లెట్, సంశయనీవటీ, చ్యవనప్రాశలేహ్యం ఈ కిట్‌లో ఉంటున్నాయి.
ఆయుర్వేదం డిమాండ్ పెరిగింది- వందేమాతరం ఆశోక్, ఆయుర్వేద ఉత్పత్తుల విక్రయ వ్యాపారి
కరోనా కు కంగారు పడకండి.. మనోధైర్యమే మొదటి ఔషధం .మన దైనందిన జీవితంలో భాగంగా ఇంటి వంటలు లో వాడె పసుపు, మిరియాలు, రాసిన చెక్క వంటివి వాతావరణ మార్పుతో వచ్చే రుగ్మతలకు ఆయుర్వేదం చక్కగా ఉపయోగపడుతుంది. జ్వరం ఎక్కువవచ్చి తగ్గుతూ ఉంటుంది..దీనికి ఆయుర్వేద నివారణ గా అమృత అరిష్టం 3మూతలు మందు 3మూతలు నిరు కలిపి రోజు రెండు సార్లు తీసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది ..దగ్గు ఎక్కవ గా ఉన్నట్లు కనిపిస్తుంది..దినికి ఆయుర్వేద నివారణ గా సిరఫ్ లు, పాలు నీటిలో కలిపి తాగే మందులు క్రమం తప్పకుండా తీసుకోవటం వలన చాలా ఈజీగా బయట పడవచ్చు.. గొంతులో ఇన్ఫెక్షన్ వస్తుంది. దినికి గొరు వెచ్చని నీరు తాగుతూ.. టొనొసిల్ వాడితే చాలా వరకు తగ్గిపోతుంది..ఇ కరోనా అందరికీ వచ్చి పోతుంది..గాభరా పడకుండా ధైర్యం గా ఉండాలి..ప్రతి ఒక్క రూ ఆయుర్వేద షాపు లొ దొరికే చ్యవన్‌ప్రాశ రోజు తీసుకోవడం ….త్రిఫల చూరణం రాత్రి వాడటం వల్ల కరోనా ను జయించ వచ్చు..ఈ ఆయుర్వేద మందులు నందిగామ లో రదం వెనుక గల పతంజలి షాపులో కూడా లభిస్తాయి. .వందేమాతరం అశోక్ 994869199, 9948691977