వీళ్లింతే.. వెకిలి చేష్టలు.. వెర్రిమాటలు.. వికృతప్రవర్తన చూస్తేనే కంపరం పుట్టించేలా చేస్తుంటారు. హిజ్రాలు.. ఆడ.. మగ గాకుండా ఉండే ఈ జాబితాలో అందరూ ఇలాగే ఉండరు. చాలామంది ఉన్నత చదువులు పూర్తిచేసి ఉన్నతంగ బతుకుతున్నారు. కానీ.. హిజ్రా వేషాలతో జనాన్ని బెదిరించి డబ్బులు వసూలు చేసే ముఠాలు కొన్ని ఉన్నాయి. తాజాగా బాచుపల్లిలో ఓ వ్యక్తి ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరుపుకుంటున్నాడు. దీన్ని అవకాశం చేసుకుని దాదాపు 20 మంది హిజ్రాలు డబ్బులు కావాలని డిమాండ్ చేశారు. వీరిని బృహన్నలగా మంచి శకునమంటూ ఇంట్లోకి ఆహ్వానించి ఎంతో కొంత ఇచ్చి పంపుతుంటారు. కానీ.. అక్కడకు వెళ్లి ముఠా మాత్రం.. చాలా దారుణంగా ప్రవర్తించారట. ఇరవైవేల రూపాయలు ఇవ్వమంటూ బీష్మించుకున్నారట. దీంతో బాధితుడు రూ.16000 ఇచ్చాడు. ఆ తరువాత పోలీసులకు ఫిర్యాదు చేయటంతో వారొచ్చి ముఠాను అరెస్ట్ చేశారు. ఎవరైనా హిజ్రాలు ఇటువంటి వికృత చేష్టలతో ఇబ్బంది కలిగిస్తే.. డయల్ 100, 94906 17444కు వాట్సాప్ చేయమని సైబరాబాద్ పోలీసు కమిషనర్ వి.సి.సజ్జనార్ సూచించారు.



