అయ్యో.. దేవినేని ఉమా మహేశ్వరరావు అలియాస్ ఉమా పరిస్థితి దారుణంగా మారింది. నిన్నటి వరకూ పక్కనే తిరిగిన అనుచరులంతా ఛీ కొడుతున్నారు. కనిపిస్తే కసితీరా దుమ్మెత్తి పోసేందుకు రెఢీగా ఉన్నారు. ఇంతకీ.. ఇంత వరకూ ఎందుకొచ్చిందనే అనుమానం వచ్చిందా! అయితే అసలు కథ మీకు తెలియాల్సిందే. ఉమా.. అప్పట్లో అంటే.. అధికారం ఉన్నపుడు ఐదేళ్లపాటు తానే నెంబరు 2 .. చంద్రబాబు తరువాత తానే అనేంతగా పెత్తనం చేశారు. సీనియర్లను పట్టించుకోలేదనే అపవాదు మూటగట్టుకున్నారు. అచ్చెన్న నుంచి ఇటు తంగిరాల సౌమ్య వరకూ ఎవరితో సఖ్యత లేదు. ఎవడైనా తనకు ఒక్కటే. కేవలం సేవకుడు మాత్రమే అనేంతగా చిన్నచూపు చూడటం ఆయన నైజం. అందాకా ఎందుకు.. నందిగామ వదలి మైలవరం వెళ్లినా.. నందిగామ నియోజకవర్గంలో తానే కీలక సూత్రదారి. తన అనుచరులదే పెత్తనం. సౌమ్య అంటే కేవలం సంతకాలకే పరిమితం అనేంతగా మార్చేశారు. అటువంటి నందిగామ నగర పంచాయతీ ఎన్నికలను సీరియస్గా తీసుకుని పసుపు జెండా ఎగురవేయాలి. కానీ.. ఇక్కడే ఉమా నిజస్వరూపం బయటపడిందంటున్నారు తెలుగు తమ్ముళ్లు.
మార్చి 11న ఎన్నికలు జరిగాయి. అంతకు ముందు రోజు ఉమా.. మై హూనా అంటూ.. వార్డుల్లో పోటీపడిన తన వాళ్లకు భరోసానిచ్చారు. కానీ ఇంతలో ఏమైందో.. సెల్ స్విఛాఫ్. అంతే.. అభ్యర్థుల్లో గుబులు. ఏం జరిగిందని తెలుసుకునేలోపుగానే సాయంత్రం నాలుగైంది. అప్పటికి కానీ.. సృహలోకి రాలేకపోయారట ఉమా. ఎవరికి ఫోన్ చేసినా స్పందించకపోగా.. తిట్లపురాణంతో మాజీ మంత్రికి అసలు చుక్కలు ఎలా ఉంటాయనేది రుచిచూపారట. ఇంతకీ.. ఉమా ఏం చేశాడంటే.. నందిగామ మున్సిపల్ ఎన్నికల్లో తమ్ముళ్లకు వెన్నుపోటు పొడిచారట. అక్కడ చైర్మన్గా బరిలోకి దిగిన టీడీపీ అభ్యర్థి శాఖమూరి స్వర్ణలత వంశీధర్కు గతంలో ఉమాతో మనస్పర్థలున్నాయి. పైగా తంగిరాల సౌమ్య సారథ్యంలో నందిగామ గెలుచుకుంటే ఉమా తన పరవు పోతుందని భయపడ్డారనే గుసగుసలూ లేకపోలేదు. అందుకే.. హ్యాండిచ్చారంటూ పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. కొందరు కార్యకర్తలైతే ఫేస్బుక్లో దారుణంగా విమర్శలకు దిగుతున్నారు. బండబూతులు తిడుతున్నారు. నందిగామ వస్తే ఉమాను కడిగేస్తామంటున్నారు. నందిగామ అంటే టీడీపీ కంచుకోట అటువంటి చోట గత ఎన్నికల్లో సౌమ్య ఘోరంగా ఓటమి చవిచూశారు. ఇప్పుడు అక్కడ మున్సిపాలిటీను కైవసం చేసుకుని పరవు కాపాడుకుందామని సౌమ్య నానా కష్ట పడి ప్రచారం చేస్తే .. మాజీ మంత్రి ఉమా దాన్ని బూడిదలో పోసిన పన్నీరుగా మార్చారంటూ తెలుగుదేశం అభిమానులు ఉమాపై తెగ గుస్సా అవుతున్నారట. వైసీపీతో ఏమైనా చీకటి ఒప్పందం పెట్టుకున్నారా! అనే అనుమానం కూడా ఉందట. మరి దీనిపై మాజీ మంత్రి
వర్యులు ఎలా స్పందిస్తారనేది వేచిచూడాల్సిందే.




No comment