బండి సంజ‌య్‌కు ఊహించ‌ని బ‌హుమ‌తి!

బండి సంజ‌య్‌కుమార్‌.. నిన్న‌టి వ‌ర‌కూ ఓ ఎంపీగా మాత్ర‌మే తెలుసు. జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల బ‌రిలో ఒక్క‌సారిగా విశ్వ‌రూపం ప్ర‌ద‌ర్శించి గొప్ప‌నేత‌గా ఎదిగాడు. హిందుత్వ నినాదంతో హైద‌రాబాద్ ప్ర‌జ‌ల మ‌న‌సు గెలిచారు. న‌రేంద్ర‌మోదీ దృష్టిలో కూడా ప‌డ్డారు. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ కుమార్‌కు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ ఫోన్ చేశారు. సుమారు 10-15 నిమిషాల స‌మ‌యం వ‌ర‌కూ మాట్లాడారు. జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల తీరు.. రాజ‌కీయ స‌ర‌ళి.. త‌దిత‌ర అంశాల‌పై అడిగి తెలుసుకున్నారు. గ‌తానికి భిన్నంగా అంద‌రూ క‌ల‌సి ఒకేతాటిపైకి న‌డ‌వ‌టం ప‌ట్ల ఆనందం వ్య‌క్తంచేశారు. తెలంగాణ‌లో బీజేపీ ప‌రిస్థితి త‌దిత‌ర అంశాల‌తోపాటు. నాయ‌కులు , కార్య‌క‌ర్త‌లు.. వారిపై జ‌రిగిన దాడుల గురించి కూడా అడిగార‌ని సంజయ్ బుధ‌వారం విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించారు. ఏమైనా.. బండి సంజ‌య్ కు స్వ‌యంగా ప్ర‌ధాని పోన్ చేయ‌టంపై పార్టీవర్గాలు తెగ ఖుషీ అవుతున్నాయ‌ట‌. బండి నాయ‌క‌త్వంపై అదిష్ఠానంలో పెరిగిన విశ్వాస‌మే.. సంజ‌య్‌కు గొప్ప బ‌హుమ‌తిగా పార్టీ శ్రేణులు అంచ‌నా వేసుకుంటున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here