ఓటు వేయమంటూ చాలామంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. లక్షలాదిమంది వాట్సాప్ గ్రూపుల్లో ఫుల్గా హీటెక్కించారు. ఇలా చెప్పిన ఎవ్వరూ కూడా పోలింగ్ బూత్ ల వరకూ రాలేదు. పైగా మూడ్రోజులు సెలవు వచ్చేసరికే మూట ముల్లె సర్దుకుని ఊరెళ్లిపోయారు. కానీ.. ఈ జంట మాత్రం.. జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో ఓటు సద్వినియోగం చేసుకోమంటూ ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటూ వినూత్నంగా ప్రచారం చేశారు.. ఇప్పుడు తెలంగాణలో వీరద్దరి గురించే టాపిక్ . గొప్ప సందేశం ఇవ్వటమే కాదు.. ఆచరిస్తూ ఆదర్శంగా నిలిచారీ ఆలుమగలు.