వరుస పరాజయాలు.. ఊహించని షాక్‌లు అపర రాజకీయ చాణక్యుడు చంద్రబాబును గందరగోళంలో పడేశాయి. ఏపీలో జగన్ వ్యతిరేకత తనకు కలసి వస్తుందని కట్టిన లెక్కలన్నీ మొన్నటి పంచాయతీ, మున్సిపాల్టీ ఎన్నికల్లో బోల్తాకొట్టించాయి. ఇప్పట్లో జగన్ హవాను అడ్డుకోలేమనే భావనకు టీడీపీ శ్రేణులు వచ్చినట్టున్నాయి. టీడీపీకు కంచుకోట వంటి శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనూ పరవు పొగొట్టుకున్నారు. విశాఖ ఉక్కు సెంటిమెంట్, అమరావతి రాజధాని సెంటిమెంట్ రెండూ టీడీపీను కాపాడలేకపోయాయి. అక్కడా ఘోరంగా ఓడిపోవటం జగన్ వర్గానికి మరింత కలసివచ్చింది. ఇదే ఊపుతో జడ్పీ, ఎంపటీసీ ఎన్నికలకు వెళ్లాలని వైసీపీ తెగ ఉబలాటపడుతున్న వేళ నిమ్మగడ్డ తూచ్ అన్నారు. ఆయన పదవిల ఉండగానే ఎన్నికలు జరిపించి తీరాలని వైసీపీ గట్టిగానే ప్రయత్నించింది. అందుకే.. నీలం సాహ్ని ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టగానే ఎన్నికల నగారా మోగించారు. దీనిపై ఇప్పటికే జనసేన హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. అయినా ఇవేమీ పట్టించుకోకుండా ఆగమేఘాల మీద ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీంతో టీడీపీ తూచ్ మేం ఎన్నికలను బాయ్‌కాట్ చేస్తున్నామంటూ ప్రకటించింది. ఇది చంద్రబాబు ఓటమి భయంతోనే చేసిన ప్రకటనగా వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. కానీ టీడీపీ మాత్రం ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగానే తామీ నిర్ణయిం తీసుకున్నట్టు చెప్పుకొచ్చారు. వాస్తవానికి ఇది బాబు ఆడలేక మద్దె ఓడు అన్నట్టుగానే చేసినట్టుగా అధికార పార్టీ ఎద్దేవా చేస్తుంది. టీడీపీ నేతలు కూడా అసలే డబ్బుల్లేక.. ఉన్న కాస్తా మొన్న పంచాయతీ, మున్సిపల్స్‌లో ఖర్చు చేశామని.. ఇప్పుడు జడ్పీ, ఎంపీటీసీల కోసం ఎందుకు చేతులు కాల్చుకోవటం అంటు బాబు మేలు చేశారంటున్నారట. ఈ లెక్కన.. బాబోరు వారి నెత్తిన పాలుపోసినట్టే. మరి.. టీడీపీకు పడాల్సిన ఓట్లన్నీ వైసీపీకు పడకపోయినా.. జనసేనకు మాత్రం గ్యారంటీగా కొన్ని ఓట్లు చీలుతాయంటున్నారు. ఈ లెక్కన జనసేన కొన్ని స్థానాలు
గెలుచుకోవటం గ్యారంటీ అని అంచనా వేసుకుంటున్నాయి జనసేన శ్రేణులు.




బాయ్ కట్ చేసే కారణం ఏదైనా…ఒక నాయకుడి పిరికితనం, ఓటమి భయం, ప్రజాక్షేత్రం పై విశ్వాసం సన్నగిల్లడం వంటి విషయాలు తేటతెల్లం..కార్యకర్తలను నాయకులను అయోమయంలో పడేసారు… Cadre Mobilization బాగా ఉంటుంది…పార్టీ కి తీరని నష్టం…ఇది అనాలోచిత చర్య.