చంద్రబాబునాయుడు.. రాజకీయాల్లో అపర చాణక్యుడు. కాలం కలసిరాని సందర్భాల్లో పీఠం దక్కించుకున్న నాయకత్వ ప్రతిభ ఆయన సొంతం. విజన్ ఉన్న నేతగా ఇప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హైటెక్ ముఖ్యమంత్రి. ఎవరు కాదన్నా.. ఔనన్నా.. హైదరాబాద్ ఉన్నతిలో.. అమరావతి పునాది వేయటంలో చంద్రబాబుదే కీలకపాత్ర. కానీ.. 2019 ఎన్నికలకు ముందు సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కొందరు పనిగట్టుకుని చేసిన తప్పులు.. అవినీతి మచ్చలు చంద్రబాబు పాలిట యమపాశంగా మారి వెంటాడాయి. ఫలితంగా మొన్న ఎన్నికల్లో ఘోర ఓటమి. కాపులను నెత్తిన పెట్టుకున్నారని.. బీసీలు దూరమయ్యారు. అండగా ఉండాల్సిన కమ్మ వర్గం దూరం జరిగింది. ఫలితంగా ఊహించని భంగపాటు చవిచూడాల్సి వచ్చింది. అయితే.. చంద్రబాబులోని ప్రత్యేక లక్షణం.. తీవ్రమైన ఒత్తిడి సమయంలో వేగంగా స్పందించటం.. రాజకీయ పాచికలతో వైరి వర్గాలను దెబ్బతీయటం.. మరి 2021 స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు తమదే పై చేయి అనే ధీమాతో ఉన్నారు. అయితే.. టీడీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు చాలామంది పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. జగన్ దెబ్బకు భయపడి కొందరు అజ్ఞాతంలోకి చేరారు. పోలీసు కేసులు.. ప్రతీకార దాడులతో బలమైన తెలుగు తమ్ముళ్లు కూడా అంటీ అంటనట్టుగా ఉంటున్నారు. ఇటీవల మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, భూమా అఖిలప్రియ వంటి వారు జైలు పాలవటం కూడా తెలుగు తమ్ముళ్లను కాస్త వెనక్కు లాగుతోంది. ఇటువంటి ప్రతికూల సమయంలో చంద్రబాబు చాణక్యత ఎంత వరకూ వర్కవుట్ అవుతుందనేది ప్రశ్నార్ధకంగా మారింది.ఇటీవల లోకేష్‌బాబు కూడా యాక్టివ్ కావటం.. దూకుడు పెంచటం.. వైసీపీపై మాటల దాడితో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ఇవన్నీ టీడీపీను ఎంత వరకూ పంచాయతీ ఎన్నికల్లో గట్టెక్కిస్తాయనేది చూడాల్సిందే.
లోకేస్ గారు దూకుడు పెంచారా,
తప్పుకొండెహా..మీద పడతారు..