అవినీతి ఇప్పుడు అదో ట్రెండ్. ఎప్పుడూ ట్రెండ్ ఫాలో అవ్వటమే కాదు.. ట్రెండ్ సెట్ చేద్దామనుకునే అవినీతి పరులూ ఉంటారు. వీళ్లను ముద్దుగా కరప్షన్ కింగ్స్ అంటారు.. కానీ.. మేం కింగ్‌లం కాదు.. చక్రవర్తులమంటూ చాటుకునే అవినీతిరాయుళ్లూ ఉన్నారు. ఇంతకీ అసలు సంగతి ఏమిటంటే.. తమిళనాడులో పన్నీర్‌సెల్వం.. అబ్బే మీరు అనుకునే సెల్వం కాదులెండీ.. ఈయన వేరు. ప్రభుత్వ ఆఫీసులో ఉద్యోగం. వెల్లూరు జిల్లాలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ఇంకేముంది.. కాంట్రాక్టులు.. కాంట్రాక్టర్లు.. ఎప్పటికప్పుడు కొత్త ప్రాజెక్టులు.. అబ్బో మూడు వంతెనలు.. ఆరు రోడ్లుగా కాలం వెళ్లదీస్తున్నాడు. అయ్యవారు పనిలో ఎంత వీరపనివాడో తెలియదుకానీ.. బల్లకింద చేతులు పెట్టడంతో మాత్రం బ్రాండ్ అంబాసిడర్ గా పేరు పొందాడు. మరి ఎన్నాళ్లని ఒపికపడతారు.. ఎవరో విజిలెన్స్‌కు ఉప్పందించారు.
అంతే రంగంలోకి దిగిన విజిలెన్స్ విభాగం పన్నీర్‌సెల్వం ఇంట సోదాలు షురూ చేసిందట. అంతే.. అదికారులకూ అక్కడ కనిపించిన బంగారు వస్తువులు, వెండి, నోట్ల కట్టలు చూసి దిమ్మతిరిగిందట. మామూలుగానే లెక్కేస్తే.. 5 కిలోల బంగారం.. 10 కిలోల వెండి.. దాదాపు 5 కోట్లరూపాయల నగదు దొరికాయట.. ఓస్ ఇంతేనా అనుకోకండి.. ఇంకా లెక్కలోకి రానివి.. గుర్తించాల్సినవి చాలా ఉన్నాయట. మరో 100 ప్రాంతాల్లో మనోడు కొన్న భూములు, అపార్ట్‌మెంట్‌లు అబ్బో ఆ లెక్క వేరేగా ఉందట. ఎంతైనా.. జయలలిత.. శశికళను చూస్తూ పెరిగి పెద్దయి.. ఉద్యోగం వెలిగబెట్టినోడు కావటంతో వాళ్లదారిలోనే తాను కూడా కోట్లకు లెక్కలు కట్టినట్టున్నాడు. కానీ.. వాళ్ల మాదిరిగా తాను కూడా శ్రీకృష్ణ జన్మస్థానం చూడాల్సివస్తుందని ఊహించి ఉండకపోవచ్చు. లేకపోతే.. కాస్త జాగ్రత్తగా అయినా ఉండేవాడు.. ఇంత బరితెగించేవాడుకాదని సహోద్యోగులు చెవులు కొరక్కుంటున్నారట. ఏమైనా.. ఇది తమిళనాడులో రికార్డు స్థాయి అవినీతి అంటున్నారు విజిలెన్స్ అధికారులు. ఎవరైనా.. తూచ్ దీన్ని గిన్నిస్ రికార్డులోకి ఎక్కించాలని ప్రయత్నిస్తారేమో అనే
అనుమానం కూడా ఉందండోయ్..!!



