బాబ్రీ తీర్పుపై ఉత్కంఠ‌!

బాబ్రీ మ‌సీదు కూల్చివేత‌పై సెప్టెంబ‌రు 30వ తేదీలోపు తుదితీర్పునివ్వాలంటూ సుప్రీం ఆదేశించటం ఉత్కంఠ‌త‌గా మారింది. మూడు ద‌శాబ్దాల క్రితం జ‌రిగిన ఘ‌ట‌న పై కేసులు, విచార‌ణ కొన‌సాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఇవ్వ‌బోయేది తుదితీర్పు కావ‌ట‌మే టెన్ష‌న్‌కు అస‌లు కార‌ణం. 1992 డిసెంబరు 6వ తేదీ సాయంత్రం బాబ్రీమ‌సీదు కూల్చివేత‌పై పోలీసులు కేసు న‌మోదుచేశారు. నిందితుల్లో ముర‌ళీమ‌నోహ‌ర్‌జోషి, ఎల్‌.కే.అద్వానీ, క‌ళ్యాణ్‌సింగ్‌, ఉమాభార‌తి, విన‌య్‌క‌టియార్‌, గిరిరాజ్ కిషోర్ త‌దిత‌రులున్నారు. 2003 సెప్టెంబ‌రు 9 రాయ‌బరేలి కోర్టు అద్వానీ, జోషి ల‌కు విచార‌ణ నుంచి ఉప‌శ‌మ‌నం క‌లిగించింది. దీనిపై కొంద‌రు 2017లో సుప్రీంను ఆశ్ర‌యించ‌టంతో వారిని కూడా విచారించాల‌నే ఆదేశాలు వ‌చ్చాయి. 2019 ఎన్నిక‌ల్లో అద్వానీకు టికెట్‌
ఇవ్వ‌క‌పోవ‌టానికి ఆదే కార‌ణ‌మ‌నే ప్ర‌చార‌మూ లేక‌పోలేదు. ఏమైనా.. ఇప్పుడు మ‌రోసారి సుప్రీం డెడ్‌లైన్ పెట్ట‌డంతో స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. నేరం రుజువైతే.. నిందితుల‌కు శిక్ష‌లు ప‌డే అవ‌కాశం ఉండ‌ట‌మే ఉత్కంఠ‌త‌కు అస‌లు కార‌ణం.

Previous articleలెక్క‌లంటే ఆ టీచ‌ర్‌కు లెక్క‌లేదు!
Next articleఆమెను 139 కాల‌నాగులు కాటేశాయ్‌?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here