అన్నయ్యతో సినిమా చేయాలనేది నా కల. అన్నయ్య రాజకీయాల్లో బిజీగా మారటంతో చరణ్‌తో సినిమా చేసే అవకాశం వచ్చింది. ఎందుకో ఆ సినిమా అనుకున్నంత ఆడలేదు. అయినా నన్ను ఒక్క మాట కూడా అనలేదు. ఎంతోమందికి హిట్లు ఇచ్చిన నేను తప్పకుండా చెర్రీకు మంచి బ్లాక్ బ్లస్టర్ ఇస్తాను.. ఇవీ గోవిందుడు అందరివాడులే సినిమా సమయంలో దర్శకుడు కృష్ణవంశీ ఎమోషనల్ స్పీచ్. కృష్ణవంశీ ప్లాప్‌లలో ఉన్నపుడు ఇంటికి పిలిచి మరీ అవకాశం ఇచ్చారు మెగాస్టార్. కథ వినకుండానే తనపై ఉంచిన నమ్మకానికి తప్పకుండా రుణం తీర్చుకోవాలనేది కృష్ణవంశీ పంతం. అందుకే.. గతంలో రైతు సినిమా బాలకృష్ణతో చేయాలనుకున్నారు. కానీ.. ఆ సినిమాలో కీలకపాత్ర అనుకున్న అమితాబ్ ఎందుకో అంగీకరించకపోవటంతో బాలయ్య సారీ చెప్పారట. దీంతో ఇప్పుడా సినిమా.. చిరంజీవితో చేసేందుకు కృష్ణవంశీ సిద్ధమయ్యాడట. దీనికి మెగాస్టార్ కూడా ఓకే అన్నారట. సినిమా కథ ఎలా ఉన్న వంశీ తనతో సినిమా చేయాలనే డ్రీమ్‌ను ఫుల్‌ఫిల్ చేసేందుకు తాను రెడీ అంటూ చెప్పారట. అంతే.. మెగాస్టార్ తన అభిమానులనే కాదు… ప్లాప్‌లతో ఇబ్బందిపడే ఎంతోమంది దర్శకులకు మరోసారి అవకాశం ఇచ్చి ట్రాక్‌లో పెట్టిన ఘనత కేవలం మెగాఫ్యామిలీకే దక్కుతుందని మెగాఫ్యాన్స్ అంటున్నారట. మరి ఈ ఇద్దరి కాంబో ఇంకెంతగా అలరిస్తుందో వేచిచూద్దాం.