అందమైన అమ్మాయిలకు వలవిసిరి అవసరాలు తీర్చుకునే ప్లేబాయ్‌లకు కొదువలేదు. కలలలోకంలో విహరించే ఆడపిల్లలను సొంతం చేసుకునే మోసగాళ్లు లేకపోలేదు. ఇదే బాపతు బ్యాచ్‌లో ఒకడు డాలర్‌బాయ్. అమెరికాలో ఏం చేశాడో తెలియదు కానీ.. ఇండియా చేరాక డాలర్‌బాయ్‌గా ముద్రవేయించుకున్నాడు. ఇతడి అసలు పేరు రాజశ్రీరెడ్డి అని కొందరు.. అబ్బే వీడిపేరు రాజశేఖర్‌రెడ్డి అంటూ పుకార్లు నడుస్తున్నాయి. షడన్‌గా ఇతడెందుకు పాపులారిటీ సంపాదించాడంటే తనపై 139 మంది రేప్‌చేశారంటూ పంజాగుట్ట పోలీసులకు 30 ఏళ్ల యువతి ఫిర్యాదు చేసింది. ఇంతమంది పేర్ల కోసం పోలీసులు ఏకంగా 42 పేజీలతో ఎఫ్ఐఆర్ రాయాల్సి వచ్చింది. ఆ జాబితాలో ఎస్ ఎఫ్ ఐ నాయకులు, యాంకర్లు, కొంతమంది ఆడవాళ్ల పేర్లు.. పచ్చిగా చెప్పాలంటే సొసైటీలో కాస్తో.. కూస్తో పేరున్న వారంతా ఉన్నారు. ఇదే ఇప్పుడు పోలీసులకు సవాల్‌గా మారింది. ఇక్కడే మరో ట్విస్ట్ ఎదురైంది. 139 నిందితుల్లో కొందరికి డాలర్‌బాయ్‌నంటూ ఫోన్‌కాల్ వెళ్లిందట.. నేను అడిగినంత ఇస్తే.. మీరు సేఫ్ లేకపోతే.. అంటూ బెదిరింపులకు దిగాడట. దీంతో సీసీఎస్ పోలీసులకు కూఫీ లాగటం మొదలుపెట్టారు. అక్కడే డాలర్‌బాయ్ పేరు బయటకు వచ్చింది. ఇతగాడిపై రెండేళ్ల క్రితమే ఒక అమ్మాయి సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అమ్మాయిలకు వల వేయటం.. ప్రేమంటూ ముగ్గులోకి దింపి పెళ్లి చేసుకుంటాడు. ఆ తరువాత సైకోగా విశ్వరూపం చూపుతాడట. ఇప్పుడు అదే డాలర్‌బాయ్ రేప్ కేసులో యువతి వెనుక ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనిపై సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తూ వార్తలు రావటంలో పోలీసులు ఇతడి ఆఫీసుపై దాడి చేశారు. అక్కడ చాలామంది యువతుల సర్టిఫికెట్లు, ఆడియో రికార్డులు దొరికాయట. దీంతో డాలర్‌బాయ్ రూపంలో ప్లేబాయ్ చేసిన మాయలు.. ఎంత మంది అమ్మాయిలను వంచించాడనేది చర్చనీయాంశంగా మారింది. అసలే హైదరాబాద్.. అడుగడుగునా గుంటనక్కలు పొంచి ఉంటాయి.. ఉద్యోగాలు ఇప్పిస్తామని.. విదేశాల్లో తిప్పుతామంటూ మాయమాటలతో మభ్యపెడుతుంటారు.. కాబట్టి.. అమ్మాయిలు పారాహుషార్!