ముసుగంటే విసుగొద్దు..

ముసుగంటే విసుగొద్దు..

ముసుగువెయ్యొద్దు మనసుమీద అని చాన్నళ్ల క్రితం సిరివెన్నెల వారు రాసారు. కానీ ముఖానికి వెయ్యొద్దని కాదు సుమా.
ఇప్పుడున్న విపరీత పరిస్థితుల్లో మాస్కు వాడకం అనివార్యమైపోయింది, మాస్కులేని మనిషిని ఊహించడమే దాదాపు అసాధ్యమిప్పుడు.
దేశవ్యాప్తంగా మాస్కులేకుండా తిరిగేవారిపైన ప్రభుత్వం జరిమానాలు కూడా విధిస్తున్నాయి.
కానీ పట్టుమని పదినిముషాలకంటే ముఖమ్మీద ఉంచుకోవడం కష్టమైపొతోందా!
ఏవో మీకందుబాటులో ఉన్న మాస్కుల్ని వాడాలని చూస్తే అలానే ఉంటుంది మరి.
ఎవరెవరు ఎలాంటి మాస్కులు వాడాలి:
పిల్లల దగ్గర్నుంచి పెద్దవాళ్లదాకా అందరికీ సరిపడ అన్ని సైజుల్లోను అన్ని బడ్జెట్లలో దొరుకుతున్నాయి.
పిల్లలకోసం చెప్పాలంటే తాజాగ డ‌బ్ల్యూహెచ్ ఓ తాజా నివేదిక లో చెప్పినట్టు 5 సంవత్సరాల లోపు పిల్లలకి అసలు మాస్కులే వాడనవసరంలేదు.

5 నుండీ 12 సంవత్సరాల పిల్లలు జనసమ్మర్ధం గల ప్రదేశాలకి వెళ్లినప్పుడు మాత్రం ధరిస్తే సరిపోతుంది. అదీ ఆటలాడేటప్పుడు మాస్కు వాడొద్దు. కాబ‌ట్టి పిల్లల‌కు ప్రత్యేకంగా దొరికే సైజుల్లో లభ్యమయ్యేవి వాడాలి. ఆన్లైన్లోను బయటకూడా వివిధ ఆప్షన్లలో దొరుకుతున్నాయి. అస‌లు మాకెందుకీ మాస్క్‌లు అనుకోకండీ.. ఎందుకంటే.. భార‌త్‌లో అగ‌స్టు నెల‌లో ఏకంగా 20 ల‌క్ష‌ల కొవిడ్‌19పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో 1,27,67 కేసులున్నాయి, ఏపీలో 4,34,771 కేసుల‌తో దేశంలోనే మ‌హారాష్ట్ర త‌రువాత రెండోస్థానానికి చేరింది.
తెలంగాణ‌లో 69శాతం మందికి ఎటువంటి ల‌క్ష‌ణాలు లేకుండానే క‌రోనా భారిన‌ప‌డ్డారని వైద్య‌శాఖ వెల్ల‌డించింది. వీరి వ‌ల్ల‌నే కుటుంబ స‌భ్యులు వైర‌స్‌తో బాధ‌ప‌డుతున్నార‌ట‌. ఏపీలో దాదాపు రోజుకు వేలల్లో కేసులు వ‌స్తున్నాయి. అక్క‌డ కూడా దాదాపు ఇదే ప‌రిస్థితి.
దీనికి మొద‌టి విరుగుడు మంత్రం.. ఆరుబ‌య‌ట‌కు వెళ్లిన‌పుడు త‌ప్ప‌కుండా మాస్క్ ధ‌రించాల్సిందే.
ఊపిరితీస్కోవడంలో ఇబ్బంది,చెమ‌ట‌పోస్తుందనే సాకులు కోసం వెత‌క‌వ‌ద్దు. స‌హ‌చ‌ర ఉద్యోగుల మ‌ధ్య ఉన్న‌పుడు, మార్కెట్‌కు వెళ్లిన‌పుడు, న‌లుగురు ఉండే ఏ ప్లేస్‌కు వెళ్లినా. మాస్క్ మ‌స్ట్ అని గుర్తంచుకోండి.

కొంతమంది ఎన్ 95 లాంటి మాస్కుల్ని కూడా వాడుతున్నారు
నిపుణుల సూచన ఏంటంతే..ఎన్95 పూర్తిగా క్లీనికల్ అవసరాలకు మాత్రమే వాడాలి
సాధారణ అవసరాలకు తాళ్లు కలిగిన మూడు వరుసలు కలిగిన డిస్పోజబుల్ మాస్కులే ఉత్త
తిరిగివాడేందుకు అనువుగా క్లాత్ మాస్కులు వాడాలనుకుంటే ఖచ్చితంగా తల వెనుక భాగంలో ముడి వేసుకునే వీలున్నవి సూచించదగినవి.
వీలైనంతవరకు ఎలాస్టిక్ రింగు చెవి తగిలించకుండా ఉంటే ఎక్కువసేపు మాస్కు వేస్కున్నా ఎలాంటి ఇబ్బందీ ఉండదు.

ఒక సారి మాస్కు వేస్కున్నాకా మాస్కు ముందు భాగాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ చేతితో తాకొద్దు, తొలగించాలన్నా కూడా త్రాళ్లను పట్టుకుని మాత్రమే తియ్యాలి. ముఖంపై త‌ర‌చూ.. వేళ్లు.. చేతుల‌తో ట‌చ్ చేయ‌వ‌ద్దు. వైర‌స్‌కు గుర‌వుతున్న వారు చేసిన తప్ప‌ల్లా.. చేతుల‌కు స‌బ్బుతో శుభ్రం చేసుకోకుండా.. శానిటైజ‌ర్ రాసుకోకుండా త‌రచూ ముఖాన్ని చేతుల‌తో తాక‌ట‌మేనంటున్నాయి ప‌రిశోధ‌న‌లు. కాబ‌ట్టి.. ముఖానికి మాస్క్ , వ్య‌క్తిగ‌త‌దూరం, చేతుల ప‌రిశుభ్ర‌త‌, మ‌రోముఖ్య విష‌యం ఏమిటంటే.. బ‌హిరంగ ప్ర‌దేశాల్లో ఉమ్మివేయ‌వ‌ద్దు. మాస్క్‌ల‌నూ ప‌డేయ‌వ‌ద్దు. కాస్త జాగ్ర‌త్త‌.. బోలెడంత ఆరోగ్యాన్నిస్తుంది. వైర‌స్‌
నుంచి త‌ప్పిస్తుంది.

“ఇక ముసుగంటే విసుగెందుకూ..” ……………….కల్యాణ్ కిషోర్, విశ్లేషకులు

3 COMMENTS

  1. చాలా చక్కగా రాశారు కిషోర్ గారు..

    మాస్క్ లేకుంటే ఉంది రిస్క్
    అది కాదు పెద్ద టాస్క్
    Wear Mask and Gloves
    Avoid Risk
    Talk less Avoid Risk
    Go for essentials only
    Keep you safe n your lovely family.

Leave a Reply to Rao Cancel reply

Please enter your comment!
Please enter your name here