కంచికచర్ల పట్టణంలో ప్రారంభించిన ఈ ఎస్ ఐ హాస్పిటల్ నందు ఇప్పుడిప్పుడే వైద్య సేవలు అందుబాటులోకి రాగా ఈరోజు ఉదయం కొందరు ఉపాధ్యాయులు, కార్మికులు వైద్యశాల నందు చికిత్స నిమిత్తం అక్కడికి వెళ్లారు అదే సమయంలో వైద్యుడు మురళీకృష్ణ ట్రాన్స్ఫర్ చేసి పంపిస్తున్న విషయం తెలుసుకొని వారు ఆందోళన వ్యక్తం చేశారు. నందిగామ,కంచికచర్ల, వీరులపాడు, చందర్లపాడు పరిసర ప్రాంతాల ఈ ఎస్ ఐ లబ్ధిదారులకు ఎట్టకేలకు ఉచితంగా డిస్పెన్సరీ నందు వైద్య సదుపాయం లభించిందని సుమారు 5 వేల మంది ఈఎస్ఐ లబ్ధిదారులు మరియు వారి కుటుంబ సభ్యులు ఇక్కడ వైద్య సహాయం పొందుతున్నారు. డాక్టర్ మురళీ కృష్ణ వైద్యం అందిస్తున్నారని అటువంటి డాక్టర్ ను మార్చవద్దని వారు తెలియజేశారు. ఎట్టి పరిస్థితిలో డాక్టర్ మురళీ కృష్ణ ను డాక్టర్ గా ఈఎస్ఐ డిస్పెన్సరీ నందు కొనసాగించాలని ఉన్నతాధికారులు చొరవ తీసుకుని తమ అభ్యర్థనను పరిగణలోకి తీసుకోవాలని కార్మికులు ఉపాధ్యాయులు కోరారు. ఈ కార్యక్రమంలో సంస్కృతీ విద్యా మందిర్ ఉపాధ్యాయులు, కార్మికులు మరియు జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.