• ఫ్లిప్‌కార్ట్‌పై తమ పేటీఎం వాలెట్ మరియు పేటీఎం యుపీఐ ద్వారా వినియోగదారులు చెల్లింపులు జరిపేందుకు అనుమతిస్తుంది
• పేటీఎం వాలెట్ మరియు యుపీఐ లావాదేవీలపై ఖచ్చితమైన క్యాష్‌బ్యాక్‌ను అందుకోనున్న కొనుగోలుదారులు
బెంగళూరు, అక్టోబర్ 5,2020 : దేశీయంగా వృద్ధి చెందిన ఈ–కామర్స్ మార్కెట్ ప్లేస్ ఫ్లిప్‌కార్ట్ నేడు తాము భారతదేశపు సుప్రసిద్ధ డిజిటల్ ఆర్థిక సేవల వేదిక పేటీఎంతో భాగస్వామ్యం చేసుకుని వినియోగదారులకు విస్తృత శ్రేణి ఆఫర్లు మరియు ప్రయోజనాలను ఈ పండుగసీజన్‌లో జరుపబోయే కొనుగోళ్లపై అందించనున్నట్లు వెల్లడించింది. ఈ భాగస్వామ్యం ద్వారా లక్షలాదిమంది పేటీఎం వినియోగదారులు సౌకర్యవంతంగా ఫ్లిప్‌కార్ట్‌పై బిగ్ బిలియన్ డేస్‌సమయంలో జరిపే కొనుగోళ్లపై తమ పేటీఎం వాలెట్ మరియు పేటీఎం యుపీఐ ద్వారా చెల్లింపులు జరుపవచ్చు.
అనుభవ పూర్వక కోణంలో చూసినప్పుడు, వాలెట్ బ్యాలెన్స్ ద్వారా జరిపే చెల్లింపులు పేటీఎం వినియోగదారులకు ఈ బిగ్ బిలియన్ డేస్ అమ్మకాలలో వేగవంతంగా చెక్‌ఔట్ చేసేందుకు తోడ్పడుతుంది. అంతేకాదు, ఫ్లాష్ సేల్స్, పరిమిత స్టాక్స్ సమయంలో నచ్చిన వస్తువులను మిస్ అయ్యే అవకాశమూ అందించదు. అదనంగా, ఫ్లిప్‌కార్ట్ వినియోగదారులు తమ పేటీఎం వాలెట్స్‌పై తక్షణ క్యాష్‌బ్యాక్ సదుపాయాన్నీ ఆస్వాదించవచ్చు.
భారతదేశంలో డిజిటైజేషన్ చెల్లింపులు వేగవంతంగా పెరుగుతున్నాయి. నూతన ఇంటర్నెట్ వినియోగదారులు తమ రోజువారీ చెల్లింపుల కోసం డిజిటల్ మార్గాలను వినియోగిస్తున్నారు. డిజిటల్ ఇండియా మిషన్‌కు దేశీయంగా వృద్ధి చెందిన సంస్థల సమిష్టి స్పందన కావాల్సి ఉంది. తద్వారా పరస్పర అనుసంధానిత వ్యాపార పర్యావరణ వ్యవస్ధలను నిర్మించడం సాధ్యమవుతుంది. ఫ్లిప్‌కార్ట్‌కు భారతీయ వినియోగదారుల పట్ల సంపూర్ణమైన అవగాహన ఉంది మరియు వీరు చురుగ్గా తమ ప్లాట్‌ఫామ్‌పై క్రెడిట్ మరియు పేమెంట్ ఆఫరింగ్స్‌ను అందిస్తున్నారు. తద్వారా వినియోగదారులకు తమ సౌకర్యం అనుసరించి డిజిటల్ మోడ్స్‌లో పయనించే అవకాశం అందిస్తున్నారు. ఈ–కామర్స్‌పై లావాదేవీలు నిర్వహించే వినియోగదారులకు చెక్‌ఔట్ సమయంలో పలు చెల్లింపు విధానాలు అందుబాటులో ఉంటాయి.
భారతదేశపు సాంకేతిక చాంఫియన్ సంస్థగా పేటీఎం ఖ్యాతి గడించింది. ప్రజలకు సృజనాత్మక పరిష్కారాలను అందించడానికి ఇది కట్టుబడి ఉంది. ఫ్లిప్‌కార్ట్‌పై ఇప్పుడు పేటీఎం యుపీఐ మరియు పేటీఎం వాలెట్‌ను అందించడం ద్వారా క్లిష్టత లేని రీతిలో ఒన్ క్లిక్ చెక్‌ఔట్ అనుభవాలను ఫ్లిప్‌కార్ట్ షాపర్లకు ఈ–కామర్స్ యాప్‌పై కొనుగోలు సమయంలో అందిస్తుంది. ఈ భాగస్వామ్యం, రాబోతున్న పండుగ సీజన్ కోసం ఫ్లిప్‌కార్ట్ యొక్క సంసిద్ధతకు అనుగుణంగా ఉంటుంది. దేశవ్యాప్తంగా ఆర్డర్ల పరంగా భారీ వృద్ధిని ఈ సమయంలో ఫ్లిప్‌కార్ట్ పొందుతుంది.
ఈ భాగస్వామ్యం గురించి రంజిత్ బోయనపల్లి, హెడ్– ఫిన్‌టెక్ అండ్ పేమెంట్స్ గ్రూప్, ఫ్లిప్‌కార్ట్ మాట్లాడుతూ ‘‘పేటీఎంతో మా భాగస్వామ్యం డిజిటల్ చెల్లింపు పరిష్కారాల పట్ల మా నిబద్ధతను ప్రదర్శించడంతో పాటుగా వినియోగదారుల లక్ష్యిత, సమ్మిళిత, ప్రజాస్వామ్యీకరించిన డిజిటల్ చెల్లింపులను అందరికీ అందిస్తుంది. ఈ పండుగ సీజన్‌లో దేశవ్యాప్తంగా లక్షలాది మంది పేటీఎం వినియోగదారులు, తమ వాలెట్స్, యుపీఐను ఫ్లిప్‌కార్ట్‌పై పొందడంతో పాటుగా ఒక్క క్లిక్‌తోనే ఈ బిగ్ బిలియన్ డేస్ వేళ అత్యుత్తమ విలువను సైతం పొందవచ్చు. అదే సమయంలో ఇండోర్స్‌లో ఉండి సురక్షిత చెల్లింపు పద్ధతులను సైతం స్వీకరించవచ్చు. యుపీఐ సహా డిజిటల్ పేమెంట్స్ భారతదేశంలో ప్రాచుర్యం పొందడంతో పాటుగా ఫ్లిప్‌కార్ట్ వద్ద మెమెప్పుడూ కూడా డిజిటల్ స్వీకరణతో భారతదేశం ఆర్ధికంగా బలోపేతం అవుతుందని నమ్ముతుంటాం’’ అని అన్నారు.
మాధుర్ డియోరా, అధ్యక్షులు–పేటీఎం మాట్లాడుతూ ‘‘క్లిష్టత లేని షాపింగ్ మరియు చెల్లింపుల అనుభవాలను అందించడానికి రెండు సాంకేతిక కంపెనీలు భాగస్వామ్యం చేసుకోవడం సంతోషంగా ఉంది. భారతదేశంలో ఈ–కామర్స్ పరంగా చాంఫియన్‌గా ఫ్లిప్‌కార్ట్ ఉంది మరియు సంయుక్తంగా మేము క్యాష్ ఆన్ డెలివరీ సదుపాయాలను డిజిటల్ చెల్లింపులతో భర్తీ చేయాలనుకుంటున్నాం. ఇందుకు పేటీఎంవాలెట్ మరియు పేటీఎం బ్యాంక్ ఖాతాలు తోడ్పడనున్నాయి. లక్షలాది మంది భారతీయులకు సృజనాత్మక పరిష్కారాలను అందించడం ద్వారా సౌకర్యం అందించాలన్నది మా ప్రయత్నం. ఆత్మనిర్భర్ భారత్‌ను నిర్మించడంలో ఇవి కీలక పాత్ర పోషించనున్నాయి. డిజిటల్ చెల్లింపుల పర్యావరణ వ్యవస్ధలో అగ్రగామిగా పేటీఎం ఉంది మరియు చిన్న నగరాలు, పట్టణాలో కూడా మమ్మల్ని స్వీకరించడం ద్వారా మేము బలీయంగా ప్రతిబింబించగలుగుతున్నాం’’అని అన్నారు.
ఆర్‌బీఐ వెల్లడించిన తాజా సమాచారం ప్రకారం, భారతదేశంలో మొత్తంమ్మీద డిజిటల్ లావాదేవీలు, అది ఏదైనా ఎలకా్ట్రనిక్ మోడ్ అయినటువంటి యుపీఐ, ఐఎంపీఎస్, డెబిట్ మరియు క్రెడిట్‌కార్డు మొదలైన వాటి ద్వారా జరిపిన లావాదేవీలు ప్రతి రోజూ 1.5 బిలియన్‌లకు రాబోయే ఐదేళ్లలో చేరవచ్చు. ఇదే సమయంలో, భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల స్థూల విలువ ప్రస్తుతం ఉన్న 5 ట్రిలియన్ రూపాయల నుంచి 2025 నాటికి 15 ట్రిలియన్ రూపాయలకు చేరవచ్చని అంచనా. ఈ తరహా భాగస్వామ్యాలు డిజిటల్ లావాదేవీల స్వీకరణను భారతదేశంలో వేగవంతం చేయడంతో పాటుగా ప్రజలు ఇళ్లలోనే ఉండి, భౌతిక దూరం అనుసరించేందుకు తోడ్పడతాయి.