ఎస్.. ఇది కాస్త ఎక్కువగా అనిపించినా పంచాయితీ ఎన్నికల్లో కనిపించిన వాస్తవం. జనసేన పట్ల ప్రజల్లో సానుకుల ధోరణి పెరుగుతోంది. ఒక్కసీటు కూడా గెలవలేదంటూ ఎద్దేవా చేసిన పార్టీల ముఖం పగిలేలా.. జనసేన.. బలపరచిన అభ్యర్థులు 100 కు పంచాయితీల్లో గెలుపొందారు. జనసేనాని పవన్‌కళ్యాణ్ ఆలోచనలకు.. ఆశయాలకు తగినట్టుగా పాలన సాగించేందుకు సిద్ధమయ్యారు. పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, గుంటూరు, చిత్తూరు వంటి కీలకమైన జిల్లాల్లో జనసేన పాగా వేస్తుందనేందుకు ఇది కేవలం శాంపిల్ మాత్రమే. నిన్నటి వరకూ సేనను తక్కువగా అంచనా వేసిన వైసీపీ కూడా.. 2024లో తమకు ప్రత్యర్థి మార్పు ఉందంటూ మాట మార్చేంత వరకూ చేరింది. అసలు తమకు జనసేన పోటీయే కాదనే స్థాయి నుంచి.. జనసేనతో గట్టిగా పోటీ పడతామనేంతగా ఫ్యాన్ రెక్కలకు చెమట్లు పట్టాయనేది జనసైనికుల ధీమా. కానీ.. తమ నాయకుడు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు అనుగుణంగా ఏ ఒక్కరినీ వ్యక్తిగత విమర్శలు చేయకుండా.. బూతులు తిట్టకుండా, కాసులు పంచకుండా నెగ్గగలమనే నమ్మకం పంచాయితీ ఎన్నికల్లో గెలిపించిన ప్రజలు తమకు మరింత భరోసా ఇచ్చారంటున్నారు.
రాజకీయాల్లో నెగ్గాలంటే రాజకీయమే చేయాలనే పంథాను సేనాని అనుసరించటం మొదలు పెట్టారు. నిన్నటి వరకూ కొద్దోగొప్పో ఆచితూచి అడుగులు వేసిన సేనాని సింహగర్జన చేస్తున్నారు. వైసీపీ, టీడీపీ శ్రేణులకు గట్టి వార్నింగ్ కూడా ఇచ్చారు. మీరు బెదిరిస్తే భయపడేందుకు సిద్ధంగా లేమన్నారు. కాదని కాలుదువ్వితే.. రండీ తాడో పేడో తేల్చుకుందామంటూ జనసేన అభిమానులకు బోలెడంత ధైర్యాన్నిచ్చారు. రెండో విడత పంచాయితీ ఎన్నికలు, ఆ తరువాత మున్సిపాలిటీల్లోనూ పవన్ దూకుడు ఎలా ఉండబోతుందనేది చూపుతామంటున్నారు మెగాఫ్యాన్స్. జనసేనకు.. మెగాస్టార్ అభిమానులు కూడా జతకడితే రాబోయే రోజుల్లో దుమ్మురేపటం ఖాయమంటున్నారు జనసైనికులు. ఈ లెక్కన. పవన్ మరోసారి రాష్ట్రంలో పర్యటిస్తే.. ప్రజల్లో
మరింతగా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందంటున్నారు జనసైనికులు.



