ముంబయి డ్రగ్‌మాఫియాతో హైదరాద్‌కు ఉన్న లింకులేమిటీ? సుశాంత్‌సింగ్ అనుమానాస్పద మృతి తరువాత మత్తుమందుల వ్యవహారం ఎందుకు బయటకు వచ్చింది? పాకిస్తాన్‌లో ఉంటూనే మత్తు దందాను దావూద్ నడిపిస్తున్నాడా? తెలుగు తెరకు కూడా మత్తు మకిల అంటించి అగ్రహీరోలు, దర్శకుల పేర్లు బయటకు రాబోతున్నాయా? ఎస్.. ప్రస్తుత పరిణామాలను చూస్తే ఇవన్నీ నిజమే అనిపిస్తుంది. శుశాంత్‌సింగ్ కేసులో అరెస్టయిన రియాచక్రవర్తి.. డ్రగ్స్ తీసుకునే సినీ తారల పేర్లు బయటపెట్టింది. దాదాపు 25 మంది రోజూ హెరాయిన్, కొకైన్, ఎల్ ఎస్‌డీ వంటివి లేకపోతే నిద్రపోరంటూ తేల్చిచెప్పింది. దీంతో బాలీవుడ్‌లో ఒక్కసారిగా కలకలం మొదలైంది. దాదాపు అగ్రతారలు, దర్శకులు, నిర్మాతలు కూడా మత్తు చేతిలో చిక్కినవారే. పనిఒత్తిడి.. జీవితాన్ని ఎంజాయ్ చేయాలనే భావనతో మత్తుకు అలవాటు పడుతున్నారనేది తెలిసిందే. అయితే.. అసలు విషయం ఏమిటంటే.. మత్తు మాఫియా చేతిలో తెలుగు నటీ నటులు ఉండటమే!
రియాచక్రవర్తి అరెస్ట్ తరువాత 25 మంది నటీనటుల పేర్లలో తెలుగు నటి రకుల్‌ప్రీత్‌సింగ్ కూడా ఉన్నట్టు వార్తలు బయటకు వచ్చాయి. రేపోమాపో ఆమెను కూడా సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు. తెలుగు హీరోల్లో మిస్టర్ ఎన్ పేరు కూడా డ్రగ్స్ వాడే వారిజాబితాలో ఉన్నట్టు బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి మూడేళ్ల క్రితమే.. టాలీవుడ్‌లో డ్రగ్స్ వాడుతున్న 20 మందిని ఎక్సైజ్ పోలీసులు అదపులోకి తీసుకుని విచారించారు. ముమైత్‌ఖాన్, పూరీజగన్నాథ్, సుబ్బరాజు, చార్మి, తరుణ్.. దాదాపు వీరంతా థాయలాండ్ ముఠాగానే ఇండస్రీలో పేరుంది. పూరి సినిమాలు దాదాపు అక్కడే తీస్తుంటాడు. కథ రాసుకునేందుకు కూడా అక్కడే మకాం వేస్తుంటాడు. డ్రగ్స్‌కు థాయ్‌లాండ్ రాజధానిగా గుర్తింపు ఉంది. పూరీ ద్వారానే తెలుగు సినిమాకు మత్తుమందులు కూడా పరిచయం అయ్యాయనే ఆరోపణలూ ఉన్నాయి. డ్రగ్స్ ను పరిమితంగా వాడే వారిలో టాలీవుడ్ టాప్‌హీరోల ఇద్దరు పేర్లు వినిపిస్తున్నాయి. వారిద్దరూ పూరీజగన్నాథ్‌తో సినిమాలు కూడా తీశారు. పైగా.. ఆ ఇద్దరికీ ముంబై దర్శకులు, నటులతో స్నేహం కూడా ఉండటంతో ఆ ఇద్దరినీ కూడా సీబీఐ విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అయితే.. డ్రగ్స్ జాబితాలో ఉన్న మిస్టర్ ఎన్? ఎవరనేది చర్చనీయాంశంగా మారింది.



