ప్ర‌కాశ్‌రాజ్‌కు నాగ‌బాబు దిమ్మ‌తిరిగే కౌంట‌ర్‌!!

జ‌నసేనాని ఊస‌ర‌వెల్లి అంటూ సంచ‌ల‌న కామెంట్స్ చేసిన న‌టుడు ప్ర‌కాశ్‌రాజ్‌కు ప‌వ‌న్ సోద‌రుడు నాగ‌బాబు దిమ్మ‌తిరిగే కౌంట‌ర్ ఇచ్చారు. రాజ‌కీయాల్లో అనే నిర్ణ‌యాలు మారుతుంటాయి. ఆ ఉద్దేశాల వెనుక లాంగ్ ట‌ర్మ్ ప్ర‌జ‌ల‌కు, పార్టీల‌కు ఉప‌యోగ‌ప‌డే అంశాలుంటాయి. మా నాయ‌కుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో బీజేపీకు మ‌ద్ద‌తు ఇవ్వ‌టం వెనుక చాలా ప్ర‌యోజ‌నాలున్నాయని నా న‌మ్మ‌కం. ఎవ‌రికి ద్రోహం చేశాడ‌ని ప్ర‌తి ప‌నికిమాలిన వాడు మా నాయ‌కుడుని విమ‌ర్శిస్తున్నాడు. ప్ర‌కాష్‌రాజ్ నీ డొల్ల‌త‌నం బీజేపీ నాయ‌కుడు సుబ్ర‌మణ్యం స్వామి డిబేట్‌లోనే అర్ధ‌మైంది. నిన్ను తొక్కి నార‌తీస్తుంటే మాట్లాడ‌టం చేత‌గాక త‌డ‌బ‌డ‌టం ఇప్ప‌టికీ గుర్తుంది. నీ దృష్టిలో బీజేపీ త‌ప్పుడు నిర్ణ‌యాలు, విధానాల‌ను విమ‌ర్శించాల‌నుకుంటే త‌ప్పుకాదు. కానీ మంచి చేస్తే అంగీక‌రించ‌లేని నీ సంస్కారం గురించి ఏం చెప్ప‌గ‌లం. ఈ దేశానికి బీజేపీ, ఏపీకు జ‌న‌సేన‌తోనే అభివృద్ధి సాధ్యం. నీలాంటి కుహ‌నా మేధావులు ఎంత వాగినా బీజేపీ, జ‌న‌సేన విజ‌యాన్ని ఆప‌లేరు.

బీజేపీ నేత‌ల్ని నువ్వు ఎన్ని మాట‌లు అన్నా వాళ్లు నిన్ను ఏమీ అన‌డంలేదంటే ఆ పార్టీ ప్ర‌జాస్వామ్యానికి ఇచ్చిన విలువ ఏమిటో అర్ధం చేసుకోవ‌చ్చు. నిర్మాత‌ల‌ను డ‌బ్బుల కోసం ఎంత‌గా హింస పెట్టావో డేట్స్ ఇచ్చి ర‌ద్దుచేసి ఎంత‌టి హింస‌కు గురిచేశావో అన్నీ గుర్తున్నాయి. మ‌రోసారి ప‌వ‌న్ గురించి మాట్లాడే ముందు ఒళ్లు ద‌గ్గ‌ర‌పెట్టుకుని మాట్లాడు. ఇదీ.. ట్వీట్ట‌ర్ ద్వారా నాగ‌బాబు ఇచ్చిన వార్నింగ్‌. నిజ‌మే.. ప్ర‌కాష్‌రాజ్ ఇప్ప‌టికే బీజేపీపై ప‌లుమార్లు విమ‌ర్శ‌లు చేస్తూ వ‌స్తున్నాడు. ప‌నిలో ప‌నిగా బీజేపీతో క‌ల‌వ‌టాన్ని త‌ప్పుబ‌డుతూ ప‌వ‌న్ ఊస‌రవెల్లిగా పేర్కొంటూ నిన్న ఒక టీవీ ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో నోరు జారాడు. ఇప్ప‌టికే ప్ర‌కాశ్‌రాజ్‌పై తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో చాలా చెడ్డ‌పేరు ఉంది. తెలుగు సినిమాపై కూడా ప‌లుమార్లు విమ‌ర్శ‌లు చేశాడు. మ‌రి ఇప్పుడు ఏకంగా ప‌వ‌న్‌పై నే నోరుజార‌టంపై మున్ముందు ప్ర‌కాశ్‌రాజ్ ప‌రిస్థితి తెలుగు సినిమాలో ఎలా ఉండ‌బోతుంద‌నేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here