పవన్ కళ్యాణ్.. ఇమేజ్ చెప్పాల్సిన పనిలేదు. రానా దగ్గుబాటి వారసుడుగా వచ్చి బల్లాలదేవుడుగా అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో పొలిటికల్ అండ్ ఎమోషన్ మూవీ వస్తుందంటే అభిమానుల్లో ఎంత ఉత్కంఠ ఉంటుందో అర్ధమవుతుంది. ఇప్పటికే వకీల్‌సాబ్‌తో ఫ్యాన్స్‌కు మాంచి కిక్ ఇచ్చిన పవర్‌స్టార్ ఇప్పుడు సితారి ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో కొత్త సినిమా చేయబోతున్నారు. ఈ విషయాన్ని పండుగరోజు ప్రకటించి మెగా అభిమానులకు డబుల్ ధమాకా ఇచ్చారు. తెలుగు సినిమా అభిమాన పోలీస్ ఈజ్ బ్యాక్ ఇన్ హై ఓల్డేజ్ రోల్ అంటూ క్యాప్షన్‌తో మరింతగా హీటెక్కిచ్చినట్టయింది. అయితే సినిమా టైటిల్ ఏమిటా అనేదానిపై మల్లగుల్లాలు పడుతున్నారట. అప్పట్లో చిరంజీవి-మోహన్‌బాబు నటించిన బిల్లా-రంగా పేరు దాదాపు
ఖరారు చేద్దామనుకుంటున్నారట.
అప్పట్లో ఆ సినిమా సూపర్‌డూపర్ హిట్. టామ్ అండ్ జెర్రీగా చిరు, మోహన్‌బాబు మధ్య వైరం పైకి కనిపిస్తున్నా.. లోలోపల ఇద్దరి మధ్య స్నేహం ఎంత గొప్పగా ఉంటుందనేది కొద్దిమందికి మాత్రమే తెలుస్తుంది. ఆ ఇద్దరూ చేసిన సినిమా టైటిల్‌తో పవన్- రానా ఇంకెంతగా గుర్తింపు తెచ్చుకుంటారో చూడాలి. మరో విశేషమేమిటంటే.. చరణ్, రానా స్నేహితులు.. రానా బాబాయి వెంకటేశ్‌తో గోపాల గోపాల చేసిన పవన్ ఇప్పుడు అబ్బాయి రానాతో కూడా నటించటం విశేషం. ఇక్కడ మరో కోసమెరుపు ఏమిటంటే.. ఎఫ్ 2 లో వరుణ్‌తేజ్, వెంకటేశ్ కలసి నటించి హిట్ కొట్టారు.. ఇప్పుడు అదే బాటలో ఆ అబ్బాయి రానా.. ఈ బాబాయి పవన్ ఇద్దరూ ఇంకెంత సూపర్ హిట్ కొట్టబోతున్నారో చూద్దాం..!!



