ఆంధ్రప్రదేశ్‌లో నిఫర్ తుఫాన్ తో పూర్తిగా దెబ్బతిన్న రైతన్నలకు గుండె ధైర్యం నింపేందుకు జనసేనాని పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు. దీనిలో భాగంగా ఏపీలోని పలు జిల్లాలను పర్యటిస్తున్నారు. తొలిరోజు గుంటూరు, కృష్ణాజిల్లాల్లోని పలు పంటభూములను పరిశీలించారు. రైతులను అడిగి పంట నష్టం గురించి అడిగి తెలుసుకున్నారు. గన్నవరం విమానాశ్రయం చేరిన పవన్‌కు అభిమానుల నుంచి సాదర స్వాగతం లభించింది. సేనాని చూసేందుకు వేలాది మంది అభిమానులు తరలిరావటంతో వారిని అదుపు చేయటం పోలీసులకు కష్టంగా మారింది. పవన్ స్వయంగా నష్టపోయిన పొలాల్లోకి దిగి పరిశీలించారు. రైతులు ఏ మాత్రం అధైర్య పడకుండా ఉండాలని సూచించారు. ప్రభుత్వం నుంచి అవసరమైన పరిహారం ఇప్పించేందుకు జనసేన తోడ్పాటుగా ఉంటుందని భరోసానిచ్చారు.