పాలకొల్లులో మధ్యతరగతి కుటుంబంలో.. ఇద్దరు తమ్ముళ్లు, ఇద్దరు చెల్లెళ్లకు పెద్దన్నయ్యగా పుట్టిన కొణిదెల శివశంకర్ ప్రసాద్. చిరంజీవిగా మారి.. మెగాస్టార్‌గా ఎదిగేందుకు పునాది పడిన రోజు 1978 ఫిబ్రవరి 11 అంటే ఈ రోజే. తూర్పుగోదావరి జిల్లా దోసకాయపల్లిలో పునాదిరాళ్లు షూటింగ్‌లో అన్నయ్య పాల్గొన్నరోజు. తెలుగు తెరకు కొత్త హీరో.. కుర్రకారుకు స్పూర్తిప్రదాత.. సినీ, రాజకీయాలకు సరికొత్త నాంది పడిన రోజు. ఏ చిరునామా లేకుండా.. కనీసం సినీ రంగంలో ఎవరి ప్రోత్సాహం అందకుండా.. పైగా అప్పటికే సినీ తెరపై ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి దిగ్గజాలు ఉన్నచోట.. పునాదిరాళ్లుతో వచ్చిన చిరంజీవి.. సుప్రీంహీరోగా మారారు. ఖైదీగా కోట్లాది మంది అభిమానుల గుండెల్లో బంధీ అయ్యారు. రుస్తుంగా నిలబడి.. చిరంజీవిగా మారారు.. అన్నయ్యగా తమ్ముళ్ల హృదయాల్లో ఉండిపోయారు. పదేళ్ల గ్యాప్ తరువాత ఖైదీ నెంబరు 150 తో మళ్లీ వచ్చినా.. అదే గౌరవం.. అదే అభిమానం చాటారు.. అన్నయ్య వెండితెరపై కనిపించినా.. కనిపించకున్నా మెగాభిమానం చిరంజీవిగా ఉంటుందని చాటుకుంటూనే ఉన్నారు.
https://www.trendsmap.com/twitter/tweet/1359765752677453827