ఖాతాదారులు వాష్.. బ్యాంక్‌ లు భేష్!!!

బ్యాంక్ అనే పదం ఒకప్పుడు డబ్బున్న మారాజులకు మాత్రమే తెలుసు. మరి ఇపుడో విద్యార్థుల దగ్గర నుండి పింఛను దారు వరకు నిత్యం బ్యాంక్ కు వెళ్లాల్సిన పరిస్థితి. దీనిని బట్టి భారదేశంలో పేదలు సైతం అభివృద్ధి చెందారు అందామా? బ్యాంక్ కి వెళ్లడం అనేది అభివృద్ధికి కొలమానమా! అంటే కానే కాదు. బ్యాంకులలో పెరిగిన రద్దీ వల్ల లబ్ది పొందేదెందరు..

భారత రిజర్వ్ బాంక్ చట్టం 1949 ప్రకారం రిజర్వ్ బాంక్ ఏర్పడి, ప్రభుత్వం తరపున ప్రజల తరపున , దేశంలోని బ్యాంకు లన్నింటికీ పెద్దన్న పాత్ర పోషిస్తుంది..ఇది ఒక స్వతంత్ర సంస్థ..దీనిలో కూడా రాజకీయ జోక్యం ఉందా అంటే ఉంది అనడానికి అనేక ఉదాహరణలు…రఘురామ్ రాజన్ లాంటి ప్రతిభావంతుడి సేవలు ఉపయోగించకోలేకపోవడం, తన కింద పనిచేస్తున్న ప్రభుత్వరంగ బ్యాంకుల‌ పై సరైన పర్యవేక్షణ కరువయి , వేల కోట్లు రుణాలు పొంది విదేశాలకు పారిపోయిన వారి విషయంలో ప్రేక్షకపాత్ర వహించడం..ఇవి మచ్చుక మాత్రమే..

1969 జులై 14 న అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ ప్రజాహితం కోరి 14 ప్రైవేట్ బ్యాంకులను జాతీయం చేశారు..ఆ తరువాత 1980 లో మరలా 6 బ్యాంకులను జాతీయ బ్యాంక్‌ ప్రకటించారు…జాతీయం చేయబడ్డ నాటినుండి బాంకుల పనితీరులో మార్పులు సంభవించాయి. ప్రజలకు అంతగా అండగా లేవనే చెప్పొచ్చు. 1991 లో ప్రపంచ వ్యాప్తంగా ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ మరియు సరళీకణ సంస్కరణ ల వల్ల బాంకుల మధ్య పోటీ తత్వం పెరిగింది. ప్రజల నుండి సేకరించిన డిపాజిట్ లతో వ్యాపారం చేసే బ్యాంకులు ఖాతాదారుల సేవలకు సర్వీసు చార్జీల రూపంలో విలువ కట్టటం మొదలుపెట్టాయి..అది కూడా ఒక శాస్త్రీయ పద్దతి లేదు..

కాష్ హ్యాండ్లింగ్ చార్జీలు
మనం కొంత పరిమితికన్నా ఎక్కువ నగదు ఖాతాలో జమ వేసిట్లయితే ఈ మొత్తాన్ని వసూలు చేస్తాయి.

ఖాతా స్టేట్మెంట్
ఒక సంవత్సర కాల పరిధిలో జరిగిన వ్యవహారాల వివరాలు ఇవ్వాలంటే ఒక్కొక్క ఖాదారునుండి 100 రూ. నుండి 200 రూ. వరకు వసూలు చేస్తాయి.

ఏ. టి. ఎం.
ATM ల వినియోగం వలన బ్యాంకులకు పనిభారం తగ్గింది. అదేవిధంగా ఖాతాదారులకు సౌకర్యం కలిగింది. పనిభారం తగ్గించినందుకు ఖాతాదారుడు మూల్యం చెలించాల్సి వస్తుంది.

వార్షిక చార్జీలు
ప్రతి దానికీ సంవత్సరం పొడవునా వసూలు చేస్తూ కూడా అదనంగా కరెంట్ ఖాతాకు 500 రూ. నుండి 700 రూ. వార్షిక ఛార్జీల రూపంలో వసూలు చేస్తున్నారు.
లోన్లు
పై చదువులకోసం విద్యార్థి తీసుకొనే లోనుపై 11.5 % నుండి 13 % వడ్డీ. సౌకర్యం, విలాసం కోసం తీసుకొనే కార్ లోను పై 8.5% వడ్డీ..ఇంతకన్నా అశాస్త్రీయం ఉందా.

కరోన సందర్భంగా Money Velocity పెంచి ప్రజల కొనుగోలు శక్తి పెరగడం కోసం, 20 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినట్లు మనకు తెలుసు. MSME లు అంటే చిన్న , మధ్య తరహా పరిశ్రమలకు చేయుతనివ్వడానికి ఉద్దేశించి బ్యాంకులకు రిజర్వ్ బాంక్ ఇచ్చింది..కానీ బాంకులు ఉద్యోగులను లోన్లు తీసుకోవాలిసిందిగా ఫోన్లు చేసి మరీ సతాయిస్తున్నాయి.
ఉద్యోగి జీతంనుండి రికవరీ అత్యంత సులువు కాబట్టి ఎటువంటి రిస్క్ లేకుండా వ్యాపారం చేస్తున్నాయి. ఒక రకంగా భారతదేశంలో జరిగేది నిబంధ‌న‌ల‌కు నీరొదిలేసిన‌ బ్యాంకింగ్ . ఉత్పాదకత లేకపోయినా పరవాలేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వడ్డీ రాయితీ ఖాతాదారులకు రీయింబర్సుమెంట్ ఎంతమందికి అందుతుందో అనుమానమే.

సేవలందించడంలో ప్రైవేట్ బ్యాంకులతో పోటీ పడకుండా సర్వీస్ చార్జీల రూపంలో వసూలు చేయడంలో పోటీ పడుతున్నాయి అనేది ఖాతాదారుల మాట. కిందిస్థాయి శాఖ దగ్గర నుండి బ్యాంకుల డైరెక్టర్ ల స్థాయి వరకు సౌకర్యాలు విలాసాలు అనుభవించడంలో కార్పొరేట్ లను తలపిస్తున్నాయి.

సామాన్యుడు లోను తీసుకొని కట్టలేకపోతే జప్తు చేయడం, బడాబాబులను వదిలివేయడం వంటి చర్యలతో బ్యాంకులు తమ విశిష్టతను, ఖాతాదారుల విశ్వాసాన్ని కొల్పోతున్నాయి. ఖాతాదారుల ఇంటివద్దకు వచ్చి బాంకులు ఖాతాదారులను బ్రతిమాలే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.

రిజర్వ్ బాంక్ తన విధులను విస్మరించకుండా, బ్యాంకులపై పర్యవేక్షణ పెంచి.. ఖాతాదారులపై భారంలేని సేవలు అందించేటట్లు చూడాలని కోరుకుందాం..

-పెర్నా విశ్వేశ్వరరావు, విశ్లేషకులు

3 COMMENTS

  1. అన్నా మీ విశ్లేషణ అమోఘం, విద్యా ఋణం వాహన ఋణం మధ్య వడ్డీ తేడా చూస్తేనే తెలుస్తుంది. బ్యాంకింగ్ వ్యవస్థ లో ఎన్ని లోపాలు ఉన్నాయనేది. మంచి వ్యాసం.

Leave a Reply to jaya prakash.G Cancel reply

Please enter your comment!
Please enter your name here