వామ్మో.. వాయ్యో.. ఎంపీ రఘురామకృష్ణంరాజు మామూలుగా దెబ్బేయలేదుగా…! ప్రభుత్వానికి ముఖ్యంగా సీఎం గారికి చురకలు వేస్తూనే.. చెప్పాల్సింది చెప్పేశారు. గుండుసూది చూపించి గడ్డపార దిగేసినంత ఘాటుగా విమర్శలు కురిపించాడు. కాస్త వ్యగ్యంం.. మరికాస్త హాస్యం.. కలబోసిన సున్నితంగా అనిపించే అంశాలను కూడా చాలా తెలివిగా కదిపాడు. తేనెతుట్టెను కదిపి వదిలేసినంత పనిచేశాడు. సీఎం గారు మీపక్కనున్న పనికిమాలినోళ్ల మాటలు వినొద్దు మొర్రో అంటూ మొరపెట్టుకున్నంత పనిచేశాడు. ఇంతకీ ఈ చర్చ ఇప్పటిది కాదు.. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అనబడే ఈ ఎంపీ పదవి చేపట్టినప్పటి నుంచి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. తాజాగా వైసీపీ ఎంపీలతో జగన్ నిర్వహించిన సమావేశానికి రఘురాముడికి పిలుపురాలేదు. పైగా తూచ్.. మీరు రానక్కర్లేదని చెప్పటంతో గట్టిగానే మండినట్టుంది. అందుకే.. మీడియా సమావేశంలో తన అక్కసంతా వెళ్లగక్కారు. జగన్ మోహన్‌రెడ్డికి సూచనలు చేస్తున్నట్టుగా చెబుతూనే.. ప్రభుత్వంలో అవినీతిని బహిర్గతం చేసే ప్రయత్నం చేశారు.
సహచర సభ్యులు దూరంగా ఉంటున్నారు.. మా అన్న చెప్పిండు.. నీకు దూరంగా జరగమని అంటూ ముఖానే చెప్పారట. అందుకే.. ఫోన్‌లో కూడా మాట్లాడటం మానేశారంటూ ఎంపీ రఘురాముడు తన బాధను పంచుకున్నాడు. తానంటే ప్రేమ ఉన్నా ఫోన్‌లో ట్యాంపింగ్ లు కూడా ఉండటంతో కాస్త బెంబేలెత్తుతున్నారట. అందుకే.. లోక్‌సభలో తన సీటును వైసీపీకు దూరంగా
జరపమంటూ రేపోమాపో.. స్పీకర్‌ను కూడా కోరతానంటూ చెప్పారు.
ఏపీలో దేవాలయాలపై జరుగుతున్నదాడులపై కూడా ఘాటుగానే స్పందించారు ఎంపీ సారు. కనకదుర్గ ఆలయంలో అమ్మవారి రథానికి ఉన్న వెండి సింహాలను దొంగిలించారు. నాలుగు సింహాల్లో ఒక్కి టిరాలేదు. మూడు వచ్చాయి. పద్మనాభస్వామి ఆలయంలో దాచినట్టుగా.. కనిపించకుండా పోయిన సింహాలను దాచామని ఒకసారి.. ఎక్కడో పాలిష్‌కు ఇచ్చామని మరోసారి చెబుతున్నారంటూ కూడా చురకేశారు. ఎందుకీ హిందు దేవాలయాల్లోనే జరుగుతున్నాయంటూ విమర్శించారు కూడా.
మీ మందిరాల గోడలు పెచ్చులు పగిలినపపుడు.. అద్దాలు పగిలినపుడు అరెస్టులు చేసినట్టుగాన ఇప్పుడు కూడా చేయమంటూ కోరుతున్నాం. అభియోగాలు రాకుండా మంచిగా ఉన్నదగిన మంత్రిని చూసి నియమించాలంటూ వెల్లంపల్లి పనితీరుపై కూడా విరుచుకుపడ్డారు.
రాయలసీమలో తన దిష్టిబొమ్మ తయారు చేసి తగులబెట్టడంపై కూడా సెటైర్ వేశారు. అసలే అక్కడ పశుగ్రాసం కొరత. కాబట్టి.. నా దిష్టిబొమ్మల కోసం పశుగ్రాసం వృధా చేయవద్దంటూ సూచన కూడా చేశారు. అక్కడ పాడిరైతులను పీల్చి పిప్పిచేస్తున్న శివశక్తి సంస్థపై కూడా ఫిర్యాదు చేశారు. పనిలో పనిగా.. తనను ఎంపీగా డిస్‌క్వాలిఫై చేయాలనే పగటి కలలు కనవద్దంటూ ఘాటుగానే వార్నింగ్ ఇచ్చారు. విప్‌ను దిక్కరించి తానేమి చేయనని.. అప్పటి వరకూ తన పదవిని ఏం చేయలేరంటూ స్పందించారు. నా పదవి పీకేయాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టవద్దని కూడా హితవు పలికారన్నమాట. ఎంతైనా.. ఏపీ ప్రత్యేకహోదా, రైల్వేజోన్‌లు కూడా గాలికొదిలేసి కేవలం తనను తొలగించేందుకు పెద్దన్న ఎంతకైనా తెగిస్తారంటూ
వైసీపీ ప్రభుత్వంపై ఘాటుగానే చురకలే వేశారు. ఏమైనా.. పక్కన ఉన్న పనికిమాలినోళ్లు ఎవరనేది మాత్రం చెప్పకుండా ఉండటమే కాస్త మిగిలిందంటూ..కొందరు వైసీపీ నేతలను ఎద్దేవా చేయటం కొసమెరుపు. ఏమైనా రఘురాముడు.. వైసీపీ ప్రభుత్వాన్ని ఇప్పట్లో వదిలేలా కనిపించట్లేదన్నటే ఉంది.



