రోజూ ఏదో మూలన మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. కరోనాతో బాధపడుతున్న మహిళలనూ మృగాలు వదలట్లేదు. ఇప్పటి వరకూ దేశంలో పలు నగరాల్లో ఇటువంటి ఘటనలు జరిగాయి. కానీ.. తొలిసారి హైదరాబాద్‌లోని ఆయుర్వేద ఆసుపత్రిలో ఉన్న కొవిడ్19 కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. ఒక యువతికి జండూభామ్ రాస్తానంటూ వైద్యసిబ్బంది ఒకడు ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించటం సంచలనం రేకెత్తిస్తోంది. శనివారం అర్థరాత్రి కాంట్రాక్టు ఉద్యోగి తనపై దారుణానికి దిగాడంటూ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అసలే కరోనా భయం.. ఆ పై వైరస్ ఎటు నుంచి వ్యాపిస్తుందనే భయం. దీన్ని అవకాశంగా మలచుకున్న కొన్ని మృగాలు ఇలా తెగబడటం ఆందోళన కలిగిస్తోంది.



