సంజ‌య్ డౌన్‌… రేవంత్ అప్ప‌ర్‌!

రాజ‌కీయాల్లో ప‌రిస్థితులు ఎప్పుడెలా మార‌తాయ‌నేది అంచ‌నా వేయ‌టం క‌ష్టం. ఉద్య‌మాల గ‌డ్డ తెలంగాణ లోనూ విభ‌జ‌న అనంత‌రం రాజ‌కీయ చైత‌న్యం బాగా పెరిగింద‌నే చెప్పాలి. 2014 రాష్ట్ర విభ‌జ‌న‌తో కేసీఆర్ సార‌థి జ‌నం బ‌లంగా న‌మ్మారు. పాల‌న కూడా ఆయ‌నే చేయాల‌నే అధిక‌శాతం ప్ర‌జ‌ల అంత‌రంగం ఓటు ద్వారా తెలియ‌జెప్పారు. 2018 ముంద‌స్తు ఎన్నిక‌ల్లోనూ కేసీఆర్ రెండోసారి సీఎం అయ్యారు. కానీ.. కేసీఆర్ ప్ర‌జ‌లు ఆశించినంత‌గా చేరువ‌కాలేక‌పోయారు. అయితే కేసీఆర్‌ను మించిన ప్ర‌త్యామ్నాయం లేద‌నే భావ‌న‌తో టీఆర్ ఎస్ కు బాగా క‌ల‌సివ‌స్తుంది. అయితే జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో ఎదురైన చేదు అనుభ‌వంతో టీఆర్ ఎస్ కాస్త ఇర‌కాటంలో ప‌డిన‌ట్ట‌యింది. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడుగా ఎంపికైన ఎంపీ సంజ‌య్ రాజ‌కీయ‌వ్యూహ‌మే దీనికి కార‌ణం. హిందుత్వ నినాదంతో జ‌నంలో బాగా మార్పు తెచ్చే ప్ర‌య‌త్నం చేసి స‌క్సెస్ అయ్యారు. అదే ఊపుతో 2023లో బీజేపీ ప్ర‌త్యామ్నాయం అనేంత‌గా వాతావ‌ర‌ణాన్ని మార్చేశారు. కానీ.. కొద్దికాలంలో ఆయ‌న సైలెంట్ అయ్యారు. అదిష్ఠానం ఆదేశాలా! తానే మౌనం వ‌హించినా పార్టీ కు మాత్రంన‌ష్ట‌మే జ‌రిగింది.

రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ బాహుబ‌లిగా అప్ప‌ట్లో హ‌స్తం పెద్ద‌లు భావించిన‌ట్టుగానే లైమ్‌లైట్‌లోకి తెచ్చారు. ఉత్త‌మ్ హ‌యాంలో త‌ల‌నొప్పిగా మారిన వ‌ర్గాల‌ను స‌మీక‌రించే ప్ర‌య‌త్నం చేశారు. ఇష్టంలేక‌పోతే పార్టీ నుంచి వెళ్లిపొమ్మంటూ రేవంతుడు ఘాటుగా హెచ్చ‌రించ‌టంతో నిన్న‌టి వ‌ర‌కూ వ్య‌తిరేక రాగాలు ఆల‌పించిన నోళ్లుకూడా మూత‌ప‌డ్డాయి. పొన్నాల కూడా సైలెంట్ కావ‌టం.. వీహెచ్ అనారోగ్యం, శశిధ‌ర్‌రెడ్డి జాడ లేక‌పోవ‌టం. భ‌ట్టి, దామోద‌రం వంటి వాళ్లు కూడా తెర వెన‌క్కి వెళ్ల‌టం రేవంత్ కు ల‌క్ కుదిరిన‌ట్టుగానే పార్టీవ‌ర్గాలు అంచ‌నా వేసుకుంటున్నాయి. పీసీసీ చీఫ్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి వ‌రుస కార్య‌క్ర‌మాల‌తోపాటు.. జ‌నంలో ఉండేటా చూసుకుంటూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. అదే స‌మ‌యంలో టీఆర్ ఎస్ పాల‌న‌.. కేసీఆర్‌పై దూకుడుతో ఉండ‌టం రేవంత్‌కు మ‌రింత క‌ల‌సివ‌చ్చింది. కేసీఆర్ ను ఎదుర్కొనేందుకు రేవంత్‌రెడ్డి స‌రైనోడు అనేంత పాపులారిటీ తెచ్చుకోవ‌టంలో అనుకున్న‌ది సాధించారు. ఇదే స్పీడు.. 2023 ఎన్నిక‌ల వ‌ర‌కూ కొనసాగించ‌గ‌లిగితే చాలంటున్నారు పార్టీ పెద్ద‌లు. మ‌రి.. ఇప్ప‌టికైనా బీజేపీ చీఫ్ సంజయ్ మ‌రోసారి జూలు విదుల్చుతారా! అట్టాగే ఉండిపోతారా అనేది రాజ‌కీయ తెర‌పై చూడాల్సిందే!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here