కొత్త కథ.. కథనం.. సరికొత్త సంభాషణలు.. ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో సుశాంత్ హ్యాట్రిక్ కొట్టబోతున్నారు. యాక్షన్ థ్రిల్లర్గా రాబోతున్న సినిమా శుక్రవారం(27న) రిలీజ్ కాబోతుంది. దర్శన్ తొలిసారి దర్శకత్వం వహిస్తున్న సినిమాలో హీరోయిన్గా మీనాక్షిచౌదరి నటించారు. కొవిడ్ అడ్డంకులను దాటుకుని ఎట్టకేలకు రిలీజ్కు సిద్ధమైంది. ఇటీవలే ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది. రూ.6.5 కోట్ల బడ్జెట్తో నిర్మించిన సినిమాకు శాటిలైట్ రైట్స్, ఓటీటీ ద్వారానే దాదాపు రూ.8కోట్లు రాబట్టడంతో లాభాల్లో ఉన్నట్టుగానే నిర్మాతలు భావిస్తున్నారు. పాత్రికేయుడిగా ఎంతో అనుభవం ఉన్న సురేష్బాబా డైలాగ్స్ సినిమాకు మరింత కిక్ తెప్పిస్తాయంటున్నారు విశ్లేషకులు. జూనియర్ త్రివిక్రమ్గా పంచ్ డైలాగ్లతో తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. విశ్లేషిస్తున్నారు. చి.ల.సౌ, అల వైకుంఠపురంలో.. ఇప్పుడు ఇచ్చల వాహనములు నిలుపురాదు సినిమాతో సుశాంత్ హ్యాట్రిక్ కొడతాడని సినీపండితులు అలవైకుంఠపురం సూపర్ డూపర్ హిట్ కావటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.
All d best