ఊర్మిళ గుర్తుందా.. గాయం, అంతం, రంగీలా సినిమాలతో అప్పట్లో కుర్రకారు మనసు దోచుకున్న హీరోయిన్. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ తరపు నుంచి ఎంపీగా బరిలోకి దిగి ఓడారు. తరచూ ఏదో ఒక వివాదాల్లో ఉంటూనే ఉంటారు. తాజాగా ముంబై లో డ్రగ్స్, బాలీవుడ్లో నెపోటిజం అంశాలపై రచ్చ జరుగుతోంది. కంగనారనౌత్ సృష్టిస్తోన్న బీభత్సం సినీ, రాజకీయ ప్రముఖులను ఇబ్బందులకూ గురిచేస్తుంది. ఊర్మిళ కూడా మొన్నీ మధ్య ముంబై పీవోకేను తలపిస్తుందంటూ కామెంట్ చేశారు. శివసేన సర్కారును దుయ్యబట్టారు. అటువంటి నటి ఊర్మిళ.. శివసేన పార్టీలోకి చేరబోతున్నారు. మంగళవారం ఉదయం సీఎం సమక్షంలో శివసేన కండువా కప్పుకోబోతున్నారట. అంతేలే.. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరంటే ఏమో అనుకుంటాం.. కానీ.. 2018 లో టీడీపీ వంటి పార్టీ కూడా కాంగ్రెస్తో దోస్తీ చేసింది. అటువంటిది.. శివసేన పార్టీలో చేరేందుకు ఊర్మిళ సిద్ధం కావటంలో ఆశ్చర్యమేముందనేది రాజకీయ వర్గాల అభిప్రాయం.