వామన స్మరణం.. పాపహరణం…

శ్రీమతే రామానుజాయ నమః
శ్లో.క స్త్వం బ్రహ్మ న్నపూర్వః క్వ చ తవ వసతి ర్యా౽ఖిలా
బ్రహ్మసృష్టిః
క స్తే త్రాతా ౽స్మ్యనాథః క్వ చ తవ పితరౌ నైవ తాం తం స్మరామి౹
కిం తే భీష్టం దదామి త్రిపదపరిమితా భూమి రల్పం కిమేతత్
త్రైలోక్యం భావగర్భం బలి మితినిగదన్వామనో వస్స పాయాత్॥

బలి:-ఓ బ్రాహ్మణోత్తమా! నీ వెవరవయ్యా!
వామన:- నేనీవూరికి క్రొత్తవాడను.
బలి:- నీ నివాసం ఎక్కడ?
వామన:- ఈ బ్రహ్మాండమంతా నా నివాసమే.
బలి:- నీకు రక్షకు డెవరు?
వామన:- నేను అనాథుణ్ణి. నాకు నాథు డెవడూ లేడు.
బలి:- నీ తల్లిదండ్రులు ఎక్కడ ఉంటారు.
వామన:- వారిన నేనెరుగను.
బలి:- నీ అభీష్టం ఏమిటి? నేను నీ కేమివ్వను?
వామన:- మూడడుగుల నేల మాత్రమే.
బలి:- అత్యల్పమైన ఈ కోరికేమిటి?
వామన:- నాకు అదే మూడు లోకాలు…ఈ విధంగా భావగర్భంగా బలిచక్రవర్తికి జవాబులిస్తున్న పరమదయాళువైన వామనమూర్తి అందరినీ రక్షించుగాక!
శ్రీవామనజయంతీ పర్వదినప్రయుక్త శుభాకాంక్షా నివేదన పురస్సరంగా!

పంపిన వారు – మిస్సుల వెంకట దీక్షితులు శ్రీనివాసరావు గారు.

Previous articleమెగా కాంపౌండ్ చుట్టూ ఎందుకీ వివాదాలు ?
Next articleకొవిడ్ చికిత్స‌కు తొలిసారి ఆప‌రేష‌న్‌: మెడిక‌వ‌ర్ ఆసుప‌త్రి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here