అమరావతి…. ఆంధ్రుల సెంటిమెంట్. పదివేల ఎకరాలిస్తే మమ్మల్ని కిరాయి ఉద్యమకారులు అంటారా! 500 రోజుల నుంచి రోడ్డెక్కిన మమ్మల్ని అవమానపరుస్తారా! అంటూ గీరాలు పోయిన భ్రమరావతి రైతుల ఉద్యమం ఇక ఏమౌతుంది. చంద్రబాబును అండ్ ఘనమైన చరిత గల వర్గాన్ని నమ్ముకున్న వారి పరిస్థితి ఇక అగమ్యగోచరమేనా! ఇదంతా ఎందుకంటే.. వైసీపీ ఆడిన డ్రామాలో పాత్రదారులుగా మిగిలిన వారిలో అమరావతి ప్రజలే కాదు.. ఉద్యమం చేపట్టిన రైతులు, మహిళలు కూడా ఉన్నారు. రాజధాని ప్రాంతంలోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో టీడీపీ ఉనికే ప్రశ్నార్దకంగా మారింది. అసలు ఆ పార్టీ అనేది ఉందా! అనే అనుమానాలకు తావిచ్చింది. రెండు కార్పోరేషన్లలోనూ టీడీపీ అంతర్గల కలహాలు, వైసీపీ ప్రభుత్వం రేకెత్తించిన భయాలు గట్టిగానే పనిచేశాయి. పైగా ఏడాది క్రితమే నామినేషన్ దాఖలు చేసిన వైసీపీ నేతలు చాపకింద నీరులా ఏడాదిపాటు డివిజన్లలో గట్టిగానే ప్రచారం చేశారు. తృణమో.. ఫణమో.. నయానో భయానో ఓటర్లను ప్రబావితం చేయగలిగారు. అయినా ఏదో మూలన టీడీపీలో ఉన్న ఆశ ఒక్క దెబ్బకు కొట్టుకుపోయింది. ఫ్యాన్ గాలికి అసలు అభ్యర్థులు ఎక్కడెలా ఉన్నారనేది అంచనా వేయటం కష్టంగా మారిందన్నమాట.
రెండు చోట్ల ఎదురైన పరాభవంతో అమరావతి రైతులు ఢీలా పడినట్టే ఉన్నారట. ఇంతకీ అసలు సంగతి ఏమిటంటే.. అమరావతి రాజధాని అనేది కేవలం అక్కడి 14 గ్రామాల ప్రజలు మాత్రమే చేయగలిగారు. కృష్ణ, గుంటూరు జిల్లాల్లోని ప్రజలు అమరావతి తమదే అనే భావనకు రాలేకపోయారు. పైగా రాజధాని కేవలం ఒక కులానికే అనే అభిప్రాయం బలపడింది. దీన్ని మరింత బలపరిచేలా వైసీపీ ప్రభుత్వం వేసిన ఎత్తుగడ ఫలించింది. మూడు రాజధానులపై ప్రజలు సానుకూలంగా ఉన్నారనేందుకు ఈ గెలుపు రిఫరెండం అంటూ రేపు వైసీపీ సర్కారు ప్రజల్లోకి వెళ్లనుంది. మీ సూచనలతోనే మేం మూడు రాజధానులను తెస్తున్నామంటూ జగన్ అనేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏమైనా.. విశాఖలో ఉక్కు సెంటిమెంట్, అమరావతి సెంటిమెంట్‌లతో గుంటూరు, విజయవాడ…. మూడు కార్పోరేషన్లపై తెలుగుదేశం జెండా ఎగురవేయాలని ఆశపడిన వారికి ఊహించని భంగపాటు ఎదురైంది. ఇది టీడీపీ పతనానికి నాందిగానే వైసీపీ లెక్కలు కడుతోంది. పునాదులు కదలిన పరిస్థితుల్లో టీడీపీను మళ్లీ గట్టెక్కించాలంటే.. జూనియర్ ఎన్టీఆర్ రావాలనే అంశం మళ్లీ తెరమీదకు వచ్చింది. టీడీపీను హైజాక్ చేసిన చంద్రబాబు, లోకేష్‌బాబులకు సవాల్ విసిరినట్టుగా మారింది.
జూనియర్ ఎన్ టి ఆర్ కాదు సీనియర్ ఎం.టి.ఆర్ వచ్చినా ప్రభంజనం లో పరార్..రెండవది ప్రతిపక్షాలు పసలేని ఆరోపణలు, ప్రభుత్వాన్ని అస్తిపరచాలని చేసిన ఎత్తుగడలు ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు..ఇక వై.సి.పి కూడా భాద్యతతో పని చేయకపోతే ప్రజలు వాళ్ళ తీర్పు వాళ్లదే రిసర్వ్ అయి ఉంటుంది..విశ్లేషణ తులనాత్మకంగా ఉంది..