బిట్‌కాయిన్ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలంటూ విదేశీ కంపెనీలను అడ్డుపెట్టుకుని స్వదేశీయులు చేసే మోసాలకు ఉదాహరణలివి. ఆశ. అవసరం ఈ రెండే మోసగాళ్లకు పెట్టుబడి. సగటు మనిషిలో దాగిన అత్యాశ మాయగాళ్లకు రూటు చూపిస్తుంది. ఇంకేముంది.. మాటలతో బురిడీకొట్టించి.. ఒకటీ అర నమ్మకం కలిగించేలా లావాదేవీలు జరిపి పర్వాలేదని ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టగానే మొత్తానికి ఎసరు పెడతారు. మోసపోయామనే తెలిలేలోపుగానే టెండర్ వేస్తారు. పోలీసుల చుట్టూ తిరగలేక కొందరు పోతేపోయిందిలే డబ్బని నోరు మూసుకుంటారు.
హైదరాబాద్ కేంద్రంగా ఒక బడా మాయగాడు.. ఇలాంటి మోసానికి తెగబడ్డాడు. అతడి పేరు సరిమళ్ల నాగరాజు. మరో నలుగురుతో కలసి 1)Rosnefthedgefund.ru, 2)rhfcoin.com, 3)rhfgold.com, 4)eurescoin.com నాలుగు వెబ్‌సైట్టు ప్రారంభించాడు. 18 వారాల్లో మీ పెట్టుబడికి పదింతలు ఆదాయమంటూ ఊదరగొట్టారు. ప్రతివారం రిటర్న్ ఇస్తామంటూ బోలెడు ఆశపెట్టారు. ఇది నిజమని భావించిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇతర రాష్ట్రాకు చెందిన 1200 మంది ఖాతాదారులు రూ.52 కోట్లు పెట్టుబడి పెట్టారు. వారాలు.. నెలల గడుస్తున్నా బిట్‌కాయిన్ సొమ్ములు రాకపోవటంతో హైదరాబాద్ సీసీఎస్‌కు ఫిర్యాదుచేశారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన సీసీఎస్ జాయింట్‌సీపీ అవినాష్ మహంతి ఇదంతా మోసాల పుట్టగా నిర్దారించారు. సిరిమళ్ల నాగరాజు ఆన్‌లైన్ బిజినెస్ పేరుతో చాలా మందిని మోసగించినట్టు గుర్తించారు. తెలంగాణలో 500 మంది బాధితులున్నట్టు తేల్చారు. నిందితుడిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్‌కు పంపారు.. కాబట్టి.. బిట్‌కాయిన్, ఆన్‌లైన్ పెట్టుబడితో లక్షలాదిరూపాయలు లాభం పొందమంటూ ఎవరైనా ప్రకటనలు గుప్పిస్తే నమ్మవద్దంటున్నా పోలీసులు.