ప్రపంచంలో అతిపురాతన సనాతన ధర్మం హైందవం. హిందుత్వం అనేది కేవలం మతంగానే చూస్తుంటారు. కానీ.. అదొక మార్గం. లక్ష్యం చేరేందుకు ఎన్నోదారులున్నట్టు.. హిందుమార్గం కూడా ఒకటి. ప్రపంచవ్యాప్తంగా పలు మతాలు.. తమ మతవ్యాప్తి కోసం లక్షల కోట్లు వెచ్చిస్తున్నాయి. ఎవరికి నచ్చిన మార్గం వారు ఎంచుకునే అవకాశం లౌకికరాజ్యంలో ఉండటంతో ఆర్ధిక, బావోద్వేగాల పరంగా ప్రతిఒక్కరికీ తమ ఇష్టమైన మతాన్ని అనుసరించే అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. ఆరేడేళ్ల వ్యవధిలో బారత దేశంలో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు హిందుత్వం ప్రమాదంలో పడబోతుందా! అనే ఆందోళన వ్యక్తమవుతోంది.
తెలుగు జాతి భవిత ఏమిటి?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు 1980ల్లో కేవలం హైదరాబాద్ మత కల్లోలాలు కర్ఫ్యూలు తప్పితే చెలరేగిన దాష్టికం కనిపించ లేదు. తొలిసారి తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత ఆ సమస్య కూడా చాలా వరకు తీరిపోయింది. టైగెర్ నరేంద్ర పాత నగరంలో ఉన్నంత కాలం ఎవరికి ఎటువంటి భయాందోళనలు లేవు. లష్కరేతోయిబా వంటి ఉగ్రవాద సంస్థలు హైదరాబాద్ నగరంపై కన్నేశాయనేది తొలిసారి సికింద్రాబాద్‌లోని పోలీసు టాస్క్‌ఫోర్స్ కార్యాలయంపై జరిగిన దాడితో తెలిసింది. ఆ తరువాత 2007లో గోకుల్‌ఛాట్, లుంబినీవనంలో జరగిన పేలుళ్లలో దాదాపు 41 మంది వరకూ మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఆ తరువాత 2010లో దిల్సుఖ్నగర్ బస్టాపులో మరోసారి ఉగ్రవాదులు బాంబుదాడితో బెంబేలెత్తించారు. దీని ప్రభావం వల్ల కొంత కల్లోలం ఏర్పడినా క్రమంగా ప్రజలు కూడా అర్ధం చేసుకున్నారు. మతాలకు అతీతంగా
ఏకతాటిపైకి వచ్చారు. మతసామరస్యం చిరునామాగా హైదరాబాద్ నిలిచింది. ఇటీవల అదిలాబాద్‌లో జరిగిన ఘటన మరోసారి ఉలికిపాటుకు గురిచేసింది. ప్రజాప్రతినిధులుగా ఉన్న నేతలు కొందరు కేవలం ఓటు బ్యాంకు కోసం సంప్రాయాలను కించపరుస్తూ చేసిన ప్రసంగాలు ఒకింత ఆశ్చర్యానికి.. ఆందోళనకూ గురిచేశాయనే చెప్పాలి. క్రమంగా ఇప్పుడు కోలుకుంటామనే సమయంలో ఏపీలో పరిణామాలు మరోసారి హిందుత్వం ప్రమాదం అంచున ప్రయాణిస్తుందా! అనే ఆలోచనకు కారణమవుతోంది.
రాష్ట్ర విభజ సమయంలో చాలా మంది తెలంగాణా నక్సలైట్ల హస్తగతమౌతుందని ఆంధ్ర ప్రదేశ్ కు ఎటువంటి ధోకా లేదని జోస్యం చెప్పారు. కాని ప్రస్తుత పరిస్థితి ఏమిటి. అటు ఆంధ్ర ప్రదేశ్ లోను ఇటు తెలంగాణా లోను నాయకులు ఆనందంగా ఉన్నారు. ప్రజలు తమలో తాము కుమిలి పోతున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో క్రైస్తవ ప్రాబల్యం పెరిగి మతమార్పిడీలు కుప్పలు తెప్పలు గా జరుగుతుంటే తెలంగాణాలో మహమ్మదీయ ప్రాబల్యం రోజు రోజుకు మించి పోతుందనేది జగమెరిగిన సత్యం. ఇది సహజంగానే మెజార్టీ ప్రజల్లో ఆందోళన కలిగిస్తుంది. తెలుగు జాతికి వన్నె తెచ్చిన మహానుభావుడు ప్రపంచ దృష్టిని భారత దేశం వైపు మరల్చిన తొలి తెలుగు ప్రధాని, బహు భాషా కోవిదుడు అపర చాణక్యుడు మొదటిసారిగా “గాంధి (నెహ్రు) ” కుటుంబ పాలనకు కళ్ళెం వేసిన మహనీయుడు, ఆర్థిక సంస్కరణలతో దేశభవితను గణనీయంగా అభివృద్ధి చేసిన పి వి నరసింహారావుగారికి భారత రత్న ఇవాలని అసెంబ్లిలో తీర్మానం చేస్తే మేము ఒప్పుకోం అనేంతగా చట్టసభలను ఘోరావ్ చేశారు.
రెండు రాష్ట్రాల్లో ఒక పార్టీని ఇంకొక పర్టీ తిట్టడంతోనే కాలం గడుస్తుంది. ప్రజహిత కార్యక్రమాలు ఆశించినంతగా ప్రజలకు చేరువ కాలేకపోతున్నాయి. పన్నులు చెల్లించగల స్థోమత ఉన్నవారి సొమ్ముతోనే ఉచిత పథకాలా! అనే భావన ప్రజల్లో పెరుగుతుంది. దేవాదాయధర్మాదాయ శాఖ సొంత ఖాతా నుంచి ఇతర కార్యక్రమాలకు, సంక్షేమ పథకాలకు నిధులు సేకరించటంపై కూడా ఏపీ ప్రజల్లో వ్యతిరేకత వస్తోంది. ఇటీవల హిందుసంఘాలు దీనిపై ఘాటుగానే స్పందించాయి. ఎన్నికల సమయంలో కేవలం ఓటు బ్యాంకుగానే మారుతున్నామనే భావన హిందువుల్లో రోజురోజుకూ పెరుగుతోంది. కొన్నేళ్లుగా స్తబ్దుగా ఉన్న హిందువుల్లోనూ ఇప్పుడిపుడే ఐకమత్య ధోరణులు కనిపిస్తున్నాయి. అయితే.. తన సంప్రదాయాన్ని ఆచరిస్తూనే.. పరాయి సంప్రదాయాలను గౌరవించాలనే విధానానానికి కట్టుబడి ఉంటూనే.. ఉద్యమంగా రేపటి కోసం ఆశగా ముందడుగు వేయటమే మిగిలింది.
B J ఆచార్యులు – విశ్లేషకులు