ఆమె వెనుక ఆయన… ఇదేదో సినిమా టైటిల్ అనుకునేరు. సీమలో రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన అఖిలప్రియకు తరచూ కేసులు తప్పట్లేదు. ఇదంతా వ్యక్తిగతమా.. రాజకీయ కక్షల్లో ఇరుక్కుంటున్నారా అనేది పక్కనబెడితే.. అఖిల పేరిట చేసే నేరాల వెనుక ఆమె రెండో భర్త భార్గవ్‌రామ్ ప్రమేయం ఉండటమే ఆందోళన కలిగిస్తుంది. భూమా నాగిరెడ్డి అంటే సీమలో గొప్ప ఇమేజ్. రాజకీయాలకు అతీతంగా ఆయనకు అభిమానులు ఉండేవారు. భార్యభర్తలిద్దరూ మరణించాక.. అఖిలప్రియ రాజకీయాల్లోకి వచ్చారు. రావటమే.. తల్లిదండ్రుల వెంట నడచిన వారిని దూరంగా ఉంచారు. భూమా కుటుంబానికి అండగా నిలిచే మేనమామ ఏ.విసుబ్బారెడ్డిని కూడా దూరం జరిపారు. ఇటీవల రూ.50లక్షల సుపారీతో సుబ్బారెడ్డి మర్డర్‌కు స్కెచ్ వేసిన వారిలో అఖిల ప్రియ భర్త భార్గవ్ పేరు వినిపించింది. అధికారంలో ఉన్నపుడు.. ఇప్పుడు మాజీ అయ్యాక కూడా నేర ప్రపంచంలో ఆమె పేరు తరచూ తెరమీదకు వస్తోంది.
ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ.. ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి వివాదాల్లో ఉంటూ వస్తున్నారు. హైదరాబాద్ శివారు హఫీజ్ పేటలోని 50 ఎకరాల భూ వివాదలంతో ప్రవీణ్ రావు అనే బ్యాడ్మింటన్ ప్లేయర్‌ను కిడ్నాప్ చేసిన వారిలో అఖిల దంపతుల ప్రమేయం ఉన్నట్టు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ వెల్లడించారు. ఏ1గా సుబ్బారెడ్డి, ఏ2 అఖిలప్రియ, ఏ3 బార్గవ్రామ్లను నిందితులుగా చేర్చారు. అఖిల, సుబ్బారెడ్డిలను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న భార్గవ్ కోసం గాలింపు చేపట్టినట్టు సీపీ అంజనికుమార్ వెల్లడించారు. అయితే సుబ్బారెడ్డి మాత్రం. తనను చంపబోయిన అఖిప్రియ తో కలసి తాను కిడ్నాప్ ఎందుకు చేస్తానంటూ కొత్త వివాదం తెరమీదకు తెచ్చారు. దీనివెనుక దాగిన నిజానిజాలు తెలుసుకునేందుకు పోలీసులకు సహకరించానన్నారు. ఏ1 నిందితుడుగా తన పేరు ఉండటం పై కూడా ఆశ్చర్యం వెలిబుచ్చారు. మరి ఇదంతా ఎలా జరిగింది. సుబ్బారెడ్డి ఎందుకీ కేసులో ఇరుక్కున్నారనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. కిడ్నాప్‌కు గురైన ప్రవీణ్‌రావు కేసీఆర్ బంధువులు కావటంతో పోలీసులు కేసులు సవాల్‌గా తీసుకుని 24 గంటల్లోనే ఛేదించారు. అసలు నిందితులను అరెస్ట్ చేశారు.