ఈ నెల 30 న ‘ఓ అమ్మాయి క్రైమ్ స్టోరీ’ గ్రాండ్ రిలీజ్

చిన్నా ప్రొడక్షన్స్ పతాకంపై కీర్తి చావ్లా ప్రధాన పాత్రలో సాధికా,ఆధీ ప్రేమ్, కవిత, శ్రీమాన్, గౌతమ్ రాజు మరియు నీలగల్ రవి నటీ, నటులుగా జి.సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏబి.శ్రీనివాస్, ఆర్. సుందర్, శ్రీధర్ పోతూరి , శాకముద్ర శ్రీధర్ లు సంయుక్తంగా నిర్మించిన లేడీ ఓరియెంటెడ్ హర్రర్ గ్రాఫిక్స్ చిత్రం ‘ఓ అమ్మాయి క్రైమ్ స్టోరీ’. ఈ చిత్రం ఈ నెల 30 న విడుదల చేస్తున్న సందర్భంగా

చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఎబి.శ్రీనివాస్ మాట్లాడుతూ …” ఇది లేడీ ఓరియెంటెడ్ చిత్రం. ఇందులో కీర్తి చావ్లా ముఖ్య పాత్రను పోషించింది. హర్రర్ ఎలిమెంట్స్ మరియు గ్రాఫిక్స్ తో పాటు, రొమాంటిక్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. గతంలో విడుదల చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ట్రైలర్ ను విడుదల చేయ బోతున్నాం. ఈ ట్రైలర్ ను కూడా ప్రేక్షకులందరు ఆదరించండి.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు వారు యుఎ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. ఈ నెల 30న ‘ఓ అమ్మాయి క్రైమ్ స్టోరీ’ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నామని అన్నారు.

నటీనటులు
కీర్తి చావ్లా, సాధికా, ఆధీ ప్రేమ్, కవిత, శ్రీమాన్, గౌతమ్ రాజు మరియు నీలగల్ రవి తదితరులు

సాంకేతిక నిపుణులు
సినిమా : ‘ఓ అమ్మాయి క్రైమ్ స్టోరీ’
కథ :- హర్రర్
బ్యానర్ :- చిన్నా ప్రొడక్షన్స్
నిర్మాతలు :- ఏబి.శ్రీనివాస్, ఆర్.సుందర్, శ్రీధర్ పోతూరి, శాకముద్ర శ్రీధర్
డైరెక్టర్ :- జి.సురేందర్ రెడ్డి
ఎడిటర్ :- మేనగ శ్రీను
పి ఆర్.ఓ. :- మధు వి.ఆర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here