పవన్ కళ్యాణ్‌పై బురదజల్లితే పేరొస్తుంది. ఆయనపై విమర్శలు కురిపిస్తే పాపులారిటీ వస్తుంది. మెగా కుటుంబాన్ని ఆడిపోసుకుంటే రాత్రికి రాత్రే సెలబ్రిటీ కావచ్చు. నిజమే.. మెగా కుటుంబం.. ఇటు ప్రశంసించే వారికే కాదు.. అటు వైపు తిట్ల పురాణం వల్లెవేసేవారికి కూడా పేరు తెచ్చేంత సత్తా ఉందనేది అర్ధమవుతోంది. పవన్.. పరిచయం అక్కర్లేని నటుడు. జనసేనానిగా గెలుపోటములకు కొత్త అర్ధం చెప్పిన నాయకుడు. అందుకేనేమో.. పవన్ సినిమాలు ప్లాప్ అయినా.. సేనానిగా ఓడినా.. సైనికులు మాత్రం ఆయన వెంటే ఉంటున్నారు. పార్టీలోకి వస్తామంటూ కండువా కప్పుకున్న నాయకులు ఎంతోమంది ఇతర పార్టీల పంచన చేరి పవన్‌ను విమర్శిస్తున్నారు.. పవర్‌స్టార్ అభిమానులు.. జనసైనికులు మాత్రం తమ నాయకుడు పవన్ అనే ధీమాగా ధైర్యంగా చెబుతున్నారు. తమకు గెలుపోటములతో పనిలేదంటూ జనసేనాని వెన్నంటి ఉంటున్నారు.. కానీ.. రాజోలులో జనసేన జెండాతో గెలిచిన రాపాక వరప్రసాద్ మాత్రం.. తాను వైసీపీ కార్యకర్తనంటూ బహిరంగంగా ప్రకటించారు. జగన్ తన దేవుడంటూ కొలుచుకుంటున్నారు. తాజాగా తాను వైసీపీలో ఉంటే పవన్‌కు వచ్చిన ఇబ్బందేమిటంటూ మరో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జనసైనికులను రెచ్చగొట్టేలా మాట్లాడారు. దీనిపై జనసేనాని ఎటువంటి విమర్శలు చేయకపోయినా.. తరచూ సేనాని రెచ్చగొట్టేలా రాపాక మాట్లాడుతున్న తీరుపట్ల మెగా ఫ్యాన్స్ ఆగ్రహంగా ఉన్నారు. తమ సేనాని మౌనాన్ని చేతగానితనంగా తీసుకుంటే రాబోయే ఎన్నికల్లో తగిన ఫలితం చవిచూస్తావంటూ సున్నితంగా హింట్ పంపుతున్నారు. అయినా.. రాపాక తమ పార్టీలో ఉన్నా.. ఏ పార్టీ కండువా కప్పుకున్నా తమకు ఓకేనంటున్నారు. ఈ మాత్రం కౌంటర్ చాలేమో రాపాకకు అంటూ జనసైనికులు ఎద్దేవా చేస్తున్నారు. రాజోలుల్లో పవన్ పేరు చెప్పుకుని గెలిచిన రాపాక వంటి నాయకుడు మాట మార్చిన తరువాత ఏ పార్టీలో ఉన్న.. ఒక్కటేనంటూ తెగేసి చెబుతున్నారు.. ఎమ్మెల్యేగారూ వినిపిస్తుందా.. జనసైనికులు ఏమంటున్నారో!!