గండాల‌తో జ‌ర్నీ నిమ్మ‌గ‌డ్డ‌!

నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్‌కుమార్‌.. ఏపీ ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌. ప్ర‌భుత్వానికి మాత్రం ఆయ‌నో టీడీపీ ఏజెంట్‌. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు అడ్డంగా ఇదే మాట్టాడేస్తున్నారు. చంద్ర‌బాబు క‌ట్ట‌బెట్టిన ప‌ద‌విను అడ్డుపెట్టుకుని వైసీపీ స‌ర్కార్‌పై ప్రతీకారం తీర్చుకుంటున్నారంటూ ఆరోప‌ణ‌లు గుప్పిస్తున్నారు. ప‌ద‌వి బోగం సంగ‌తి ఎలా ఉన్నా తెలియ‌ని గుబులు మాత్రం రోజురోజుకూ ఆయ‌న్ను వెంటాడుతోంది. పంతం నీదా.. నాదా సై అంటూ నేనేమీ త‌క్కువ తిన‌లేదంటూ నిమ్మ‌గ‌డ్డ గ‌ట్టిగానే వైసీపీ తీరుపై ఫైట్ చేస్తున్నారు. క‌మ్మ వ‌ర్సెస్ రెడ్డి వ‌ర్గం మ‌ధ్య జ‌రుగుతున్న పోరుగా సామాజిక మాధ్య‌మాల్లో ట్రోలింగ్‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ప‌ద‌వి చేప‌ట్టిన‌ప్పుడు నిమ్మ‌గ‌డ్డ ఎవ‌రో చాలామందికి తెలియ‌దు. కానీ ఇప్పుడు వెబ్‌సైట్ల‌లో మొద‌ట‌గా కొట్టే పేరు ఆయ‌నే అవుతుంది. వైసీపీ ఎంపీ విజ‌య‌ సాయ‌రెడ్డి, స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ఉర‌ఫ్ ఎస్సార్‌కే వంటి ఉద్దండులు మాత్రం అస‌లు నిమ్మ‌గ‌డ్డ ఎలా ఐఏఎస్ పాస‌య్యారంటూ సెటైర్లు వేస్తున్నారు. విజ‌య‌సాయి అయితే మ‌రో అడుగు ముందుకేసి నిమ్మ‌గ‌డ్డ .. నాకు నిమ్మ‌కాయ‌.. ఉల్లిగ‌డ్డ గురించి మాత్ర‌మే తెలుసంటూ త‌న‌దైన శైలిలో పంచ్‌లు వేస్తున్నారు.

తాజాగా ఏపీ మంత్రులు నిమ్మ‌గ‌డ్డ‌పై స‌భాహ‌క్కుల ఉల్లంఘ‌న నోటీసులు కూడా ఇప్పించారు. దీంతో స్పీక‌ర్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకోబోతున్నానేది ఉత్కంఠ‌త‌గా మారింది. ఏమైనా ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా అప్ప‌ట్లో శేష‌న్ ఎంత‌గా గుర్తున్నారో.. ఇప్పుడు అదే దారిలో నిమ్మ‌గ‌డ్డ కూడా మంచో..చెడో గుర్తింపు తెచ్చుకున్నారు. టీడీపీ తాజాగా వేసిన గ్రామ పంచాయ‌తీ మేనిఫెస్టోపై వైసీపీ ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేసింది. అయితే ఈ మొత్తం వ్వ‌హారంలో చంద్ర‌బాబు మాట్లాడినంత‌గా… ఎక్క‌డా సీఎం జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి స్పందించ‌ట్లేదు. పైగా త‌మ సంక్షేమ ప‌థ‌కాలు గ‌ట్టెక్కిస్తాయ‌నే ధీమాగా ఉన్నారు. ఏమైనా ఈ సారి వైసీపీ ఎక్కువ చోట్ల నెగ్గినా ఆ క్రెడిట్ కూడా జ‌గ‌న్ ఖాతాలో వేయాల్సిందే. అదే స‌మ‌యంలో నిమ్మ‌గ‌డ్డ అధికార జ‌ర్నీ మాత్రం దిన‌దిన‌గండంగానే కొన‌సాగాల్సి ఉంటుంద‌నే సంకేతాలు లేక‌పోలేదు.

Previous articleచంద్ర‌బాబు చాణ‌క్యం వ‌ర్క‌వుట‌య్యేనా!
Next articleసిల్వ‌ర్ స్ర్కీన్‌పై మెగా నామ సంవ‌త్స‌రం..!

1 COMMENT

  1. ఇటువంటి నిజాయితీ, నిష్పక్షపాతి గొప్ప మనిషి, గురించి మాట్లాడాకపోవడం మంచిది

Leave a Reply to పివిరావు Cancel reply

Please enter your comment!
Please enter your name here