ఆర్ ఆర్ ఆర్ ట్రైల‌ర్‌కు మెగాస్టార్ వాయిస్ ఓవ‌ర్ !

ఆర్ ఆర్ ఆర్‌.. నంద‌మూరి, కొణిదెల వార‌సుల మ‌ల్టీస్టార్ మూవీ. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకుంటున్న పాన్ ఇండియా మూవీపై ఇప్ప‌టికే బోలెడు అంచ‌నాలున్నాయి. రామ‌చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజుగా.. ఎన్టీఆర్ కొమ‌రం భీమ్‌గా న‌ట విశ్వ‌రూపం ప్ర‌ద‌ర్శించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసిన సినిమాపై ఇద్ద‌రు హీరోల అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. దేశ‌భ‌క్తికి సంబంధించిన సిసిమా కావ‌టంతో జ‌న‌వ‌రి 26న సినిమా ట్రైల‌ర్ విడుద‌ల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధ‌మ‌వుతుంది. దీనిలో భాగంగానే మెగాస్టార్ చిరంజీవితో ట్రైల‌ర్‌కు వాయిస్ ఓవ‌ర్ చెప్పించబోతున్నారు. దీంతో మెగాస్టార్ ఫ్యాన్స్‌లో హుషారు నెల‌కొంది. అన్న‌య్య పాట‌.. ఆట‌.ఫైటే కాదు.. మాట కూడా త‌మ‌కు గిఫ్ట్‌గానే ఫ్యాన్స్ చెబుతున్నారు. గ‌తంలోనూ కార్టూన్ మూవీ , రుద్ర‌మ‌దేవి వంటి వాటి వాయిస్ ఓవ‌ర్ ఇచ్చి త‌న పెద్ద‌రికం చాటుకున్నారు. క‌ళామ‌త‌ల్లికి అవ‌స‌ర‌మైన ప్ర‌తిసారి తాను ముందు ఉంటానంటూ ఇటీవ‌ల క‌రోనా స‌మ‌యంలోనూ సినీ కార్మికుల‌ను ఆదుకున్నారు. అన్న‌య్య‌ పెద్ద మ‌న‌సు చాటుకున్నారంటున్నారు మెగా ఫ్యాన్స్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here